Saturday, July 24, 2021

సెక్స్ టేప్… యడియూరప్పను ఇరికించిన రమేష్ జర్కిహోళి.. సీఎం కుర్చీకే ఎసరు..?

ప్రహ్లాద్ జోషి కాబోయే సీఎం : రమేష్ జర్కిహోళి

మహిళ : బెల్గాంలో మరాఠీలు,కన్నడిగులు ఎప్పుడూ గొడవలు పడుతుంటారు కదా?

రమేష్ జర్కిహోళి : మరాఠీలు చాలా మంచివారు. కన్నడిగులకే ఏ పనీ పాటా లేదు.

జర్కిహోళి : సిద్దరామయ్య చాలా మంచివారు. కానీ యడియూరప్ప చాలా అవినీతి చేశాడు.

మహిళ : మీరు తరుచూ ఢిల్లీ వెళ్తున్నారు… సీఎం కాబోతున్నారా…?

జర్కిహోళి : నేను కాదు ప్రహ్లాద్ జోషి సీఎం కాబోతున్నారు.

ప్రతిపక్షాలకు అస్త్రంగా... టార్గెట్ యడ్డీ...

ప్రతిపక్షాలకు అస్త్రంగా… టార్గెట్ యడ్డీ…

రమేష్ జర్కిహోళి చేసిన వ్యాఖ్యలు యడియూరప్పను ఇరుకునపెట్టేవిగా మారాయి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ… ‘ఇది కేవలం సెక్స్ స్కాండల్ మాత్రమే కాదు. ఆ మంత్రి ముఖ్యమంత్రి యడియూరప్ప గురించి మాట్లాడుతూ ఆయన అవినీతిపరుడని చెప్పాడు. దీనికి సీఎం జవాబు చెప్పాలి. బంతి ఇప్పుడు వాళ్ల కోర్టులోనే ఉంది. నాకు తెలిసి బీజేపీ అధిష్టానం సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నాను.’ అని డీకె శివకుమార్ వ్యాఖ్యానించారు. అంటే,అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించాలని డీకె శివకుమార్ పరోక్షంగా డిమాండ్ చేసినట్లు కనిపిస్తోంది.

యడియూరప్పను దించేందుకు...

యడియూరప్పను దించేందుకు…

నిజానికి యడియూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించబోతున్నారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. అవినీతి ఆరోపణలు,వయసు పైబడటంతో చురుగ్గా పనిచేయలేకపోతున్నారన్న విమర్శలు, కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారని సొంత గూటి నేతల్లో నెలకొన్న అసంతృప్తి… వెరసి యడియూరప్పను కుర్చీ నుంచి దించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం ఆ పార్టీ నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం కూడా చేశారు.

సీఎం కుర్చీకే ఎసరు...

సీఎం కుర్చీకే ఎసరు…

గత నెలలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ కూడా యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి తప్పించబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉగాది తర్వాత రాష్ట్రంలో యడియూరప్ప స్థానంలో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన అన్నారు. తాజాగా లీకైన సెక్స్ టేపులో రమేష్ జర్కిహోళి ‘ప్రహ్లాద్ జోషి’ సీఎం కాబోతున్నారని అన్నారు. ఇవన్నీ గమనిస్తే యడ్డీని సీఎం కుర్చీ నుంచి దించేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇదే టేపులో యడ్డీపై రమేష్ జర్కిహోళి చేసిన అవినీతి ఆరోపణలు అటు ప్రతిపక్షంతో పాటు ఇటు సొంత పార్టీలోని యడ్డీ వ్యతిరేక వర్గానికి అస్త్రంలా మారాయని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం అటు తిరిగి,ఇటు తిరిగి చివరకు యడియూరప్ప సీఎం కుర్చీకి ఎసరు పెట్టేలా మారిందన్న చర్చ జరుగుతోంది.


Source link

MORE Articles

How to watch Surfing at Olympics 2020: key dates, schedule, free live stream and more

 Set to make a splash in Tokyo, surfing is one of five brand-new sports to make its Olympic debut at the 2020 Games....

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe