17 నుంచి 24 ఏళ్లు
బ్రిస్బేన్‌లో 17 నుంచి 24 ఏళ్ల మహిళలను తన వలలో వేసుకున్నాడు. వారిని ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి అతని వద్దకు మహిళలు వచ్చారో ఇక అంతే సంగతులు. వారికి టాటూ వేస్తాడు. దీంతో ఆ సదరు యువతి అతని సొత్తు అవుతోంది. అతని బందీఖానా నుంచి ఆమె తప్పించుకోలేదు. ఒకవేళ తప్పించుకున్న.. మ్యాథ్యూ ప్రాపర్టీ కాబట్టి ఎవరూ ఏమీ చేయరు.. అంటే తిరిగి అతనికే అప్పగిస్తారు.

సీక్రెట్‌గా వీడియో తీసి
సదరు మహిళలతో బలవంతంగా రొంపిలోకి దింపుతాడు. వారు విటులతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తాడు. అలా కూడా వారిని బెదిరిస్తాడు. ఈ నెలలోనే మ్యాథ్యూపై పోలీసులు మరో 10 అభియోగాలను మోపారు. వ్యభిచారం, అనైతిక కార్యకలాపాలు, 18 ఏళ్లలోపు బాలికలకు మత్తు మందు ఇవ్వడం లాంటి అభియోగాలను మోపారు. కేసు విచారణలో మరో 13 నేరాలు కూడా నమోదు చేశామని క్వీన్స్ లాండ్ పోలీసులు తెలిపారు. విచారణలో వచ్చిన ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేశామని చెప్పారు.

చాలామంది..
మ్యాథ్యూ బారిన ఇంకా చాలా మంది ఉన్నారని పోలీసులు అంటున్నారు. వారు బయటకు వచ్చి నిజాలు తెలియజేయాలని కోరుుతున్నారు. అప్పుడే అతనికి కఠిన శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు.