Tuesday, April 13, 2021

సౌత్ పసిఫిక్‌లో 7.7 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరికలు, భారీ అలలు, ఆ దేశాలు అప్రమత్తం

International

oi-Rajashekhar Garrepally

|

సిడ్నీ: సౌత్ పసిఫిక్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. కాగా, ఈ భారీ భూకంపం తర్వాత ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

న్యూ కాలిడోనియాలోని వావోకు తూర్పున 415 కిలోమీటర్లు (258 మైళ్ళు) 10 కిలోమీటర్ల లోతులో గురువారం తెల్లవారుజామున (బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత) భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

పలు తీరాలకు “ప్రమాదకర సునామీ తరంగాలు” ఉన్నాయని అమెరికా ప్రభుత్వం ఎన్‌డబ్ల్యూఎస్ పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఫిజి, న్యూజిలాండ్, వనాటుల ద్వీప దేశాలకు అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు తరంగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి వివరాలను వెల్లడించలేదు.

ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెట్రోరాలజీ కూడా ఒక ట్వీట్‌లో సునామీ సంభవించినట్లు ధృవీకరించింది. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి తూర్పున 550 కిలోమీటర్లు (340 మైళ్ళు) దూరంలో ఉన్న లార్డ్ హోవే ద్వీపానికి ముప్పు ఉందని హెచ్చరించింది.

న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తీరప్రాంతాల్లోని ప్రజలు వాటర్ ఫ్రంట్‌ల నుంచి దూరంగా ఉండమని ఒక ప్రకటన విడుదల చేసింది. ‘7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత న్యూజిలాండ్ తీరప్రాంతాలు తీరంలో బలమైన, అసాధారణమైన అలలు వస్తాయని భావిస్తున్నాం’ అని విపత్తు సంస్థ తెలిపింది.

ప్రభావిత ప్రాంతాలలో న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి ఉత్తరం, ఆక్లాండ్‌కు తూర్పున గ్రేట్ బారియర్ ద్వీపం, దేశం తూర్పున తీరం ఉన్నాయి. కాగా, సునామి లేదా భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ప్రాధమిక నివేదికలు లేవు,.


Source link

MORE Articles

खुद से है प्यार, सोने से पहले एक गिलास दूध में मिलाकर पिएं 1 चम्मच सौंफ, फायदे हैरत में डाल देंगे!

नई दिल्ली: भारत के लगभग हर घर में सौंफ का इस्तेमाल होता है. इसके मीठे स्वाद और महक के कारण ज्यादातर लोग माउथ...

HomeX, which pairs service workers with homeowners and uses AI to diagnose home-related issues, raises $90M, says number of contractors on HomeX rose 5x...

Mary Ann Azevedo / TechCrunch: HomeX, which pairs service workers with homeowners and uses AI to diagnose home-related issues, raises $90M, says number...

Coronavirus छूने से नहीं फैलता, US की नई रिसर्च में दावा

वाशिंगटन: साल 2021 में जब कोरोना वायरस (Coronavirus) बहुत तेजी से फैल रहा था, तब हालत ये थी कि कुछ भी छूने से...

భారత్‌లో విలయం: Sputnik V రాకతో భరోసా? -రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత ఎంత? -కీలక అంశాలివే

భారత్‌లో మూడో వ్యాక్సిన్.. మన దేశంలో కొవిడ్ కేసులకు సంబంధించి అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను వాడుతున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన అందరికీ టీకాలను...

ఏపీలో కరోనా కల్లోలం : గత 24 గంటల్లో 4,228 కొత్త కేసులు ,10 మరణాలు, జిల్లాల వారీగా కేసులివే !!

గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి , మొత్తం కేసుల సంఖ్య 9,32,892 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నమోదైన మొత్తం కేసులతో కలిపి...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe