స్టాక్స్‌ కోసం వెతుకులాట ఆపండి, ఇంటర్నేషనల్‌ కంపెనీ ఇచ్చిన ‘బయ్‌’ లిస్ట్‌ ఇదిగో!

[ad_1]

Credit Suisse: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే, ఇండియన్‌ మార్కెట్లు చాలా బెటర్‌గా పని చేస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక మాంద్యం ప్రభావాలు పెద్దగా లేకుండా ముందుకు సాగుతున్నాయి. ఈ పని తీరుకు… దేశీయ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పరోక్షంగా కారణం. ఇదే నిజం. మన మార్కెట్‌ పడిపోకుండా మనమే నిలబెట్టుకున్నాం.

ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ క్రెడిట్‌ సూయిస్ (Credit Suisse), ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్ల మీద ఒక నివేదిక విడుదల చేసింది. 

భారత మార్కెట్లు భేష్‌
భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని చక్కగా నియంత్రించారని, ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వృద్ధి ధోరణి స్థితిస్థాపకంగా ఉండవచ్చని (బంతిలా బౌన్స్‌ అవుతుందని)  క్రెడిట్ సూయిస్ అభిప్రాయపడింది.

2022లో.. రుణ వృద్ధిలో స్థిరత్వం, ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు, పటిష్టమైన కార్పొరేట్ ఆదాయాల ద్వారా భారతదేశ మార్కెట్ల ఔట్‌ పెర్ఫార్మెన్స్‌ కొనసాగిందని, ఇవి గమనించాల్సిన కీలకమైన అంశాలని ఫారిన్‌ బ్రోకరేజ్‌ ఫర్మ్‌ తెలిపింది.

news reels

“ప్రభుత్వం చేసే వ్యయంలో వృద్ధి, ప్రైవేట్ మూలధన వ్యయం పెరగడం, రియల్ ఎస్టేట్‌లో పునరుద్ధరణ, ఉత్పాదక రంగాన్ని పెంచడానికి ప్రభుత్వ కార్యక్రమాల [ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (PLI) వంటివి] కారణంగా దేశీయ డిమాండ్ బలంగా ఉంటుందని మేం ఆశిస్తున్నాం”                              – క్రెడిట్ సూయిస్ ఈక్విటీ రీసెర్చ్ ఎనలిస్ట్‌ ప్రేమల్ కమ్దార్ 

FY22లో 13 శాతంగా ఉన్న రుణాల వృద్ధి FY23లో ఇప్పటివరకు 17 శాతానికి పెరిగింది. ఇది, FY20లో నమోదైన 5 శాతం కనిష్ట స్థాయి నుంచి చాలా వేగవంతమైన పెరుగుదలగా క్రెడిట్‌ సూయిస్ పేర్కొంది. పరిశ్రమ సామర్థ్య వినియోగం పెరగడం, క్యాపెక్స్ సైకిల్‌లో పునరుద్ధరణ కారణంగా కార్పొరేట్ రుణ వృద్ధి ఆరోగ్యంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

బ్లూంబెర్గ్ ఏకాభిప్రాయ అంచనాల ఆధారంగా… FY24, FY25 సమయంలో నిఫ్టీ కార్పొరేట్ ఆదాయాలు వరుసగా 15 శాతం, 13 శాతం పెరుగుతాయని లెక్కగట్టారు. ప్రస్తుతం ఖర్చుల ఒత్తిడి తగ్గుముఖం పట్టడంతో, క్రెడిట్ సూయిస్ కూడా దాదాపు ఇవే అంచనాలను సమర్థించింది.

ప్రస్తుతం, ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ వాల్యుయేషన్ 10 సంవత్సరాల సగటు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ; వృద్ధి అంశాల నేపథ్యంలో ఆ విలువ సమర్థనీయం, న్యాయబద్ధమేనని క్రెడిట్‌ సూయిస్‌ చెప్పింది.

క్రెడిట్‌ సూస్‌ బయ్‌ రికమెండేషన్స్‌
లార్జ్ క్యాప్స్‌లో టాప్‌ పిక్స్‌: గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హావెల్స్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ICICI బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మహీంద్రా & మహీంద్రా, మారికో, SBI

మిడ్ క్యాప్స్‌లో టాప్‌ పిక్స్‌: అసాహి ఇండియా, క్రాంప్టన్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, డిక్సన్ టెక్నాలజీస్, JB కెమికల్స్ & ఫార్మా, PI ఇండస్ట్రీస్, PVR, సన్‌టెక్‌ రియాల్టీ, వినతి ఆర్గానిక్స్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *