[ad_1]
Stock Market Opening 18 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 95 పాయింట్ల లాభంతో 18,148 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 367 పాయింట్ల లాభంతో 61,023 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,655 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,716 వద్ద మొదలైంది. 60,569 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,052 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 367 పాయింట్ల లాభంతో 61,023 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 18,053 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,074 వద్ద ఓపెనైంది. 18,032 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,157 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 95 పాయింట్ల లాభంతో 18,148 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,271 వద్ద మొదలైంది. 42,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,527 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 250 పాయింట్లు పెరిగి 42,485 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్, బీపీసీఎల్, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply