స్పెషల్ సాంగ్స్, యాక్షన్ సీన్స్ లేకుండా కల్కి, పుష్ప 2 లను బీట్ చేసిన చిన్న మూవీ.. ఏదంటే..!

Date:

Share post:


ఇండస్ట్రీలో సినిమా ఏదైనా రిలీజ్‌కు ముందే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు గెస్ చేయలేరు. సినిమా సక్సెస్, ఫెయిల్ అన్ని సినిమా చూసే ఆడియన్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఆడియన్స్‌నేఉ ఆకట్టుకునేలా స్ట్రాంగ్ కంటెంట్ సినిమా రూపొందిస్తే కచ్చితంగా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటే.. మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు గుండెల్లో హత్తుకునేలా డిజైన్ చేస్తూ ఉంటారు మేకర్స్. అలాంటి సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అదే కోవ‌కు వ‌స్తుంది. ఒక ఫైట్ లేకుండా.. స్పెషల్ సాంగ్ లేకుండా.. డబల్ మీనింగ్ డైలాగ్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ అస్సలు లేకుండా వ‌చ్చి భారీ హిట్ అందుకుంది. అది పెద్ద స్టోరీ కూడా కాదు. కానీ ప్రతి చిన్న సన్నివేశం ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఏకంగా 8.5 ఐఎమ్‌డిబి రేటింగ్ తో ఇప్పటికి ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అంత సైలెంట్ గా వచ్చి ప్రేక్షకులను ఇంతలా దోచుకున్న ఆ ఎమోషనల్ డ్రామా ఏదో.. ఒకసారి తెలుసుకుందాం.

Satyam Sundaram Gets Good Reviews, But Can It Beat Devara? -  TeluguBulletin.com

గత ఏడాది రిలీజ్ అయిన చాలా సినిమాలు ఆడియ‌న్స్‌ను పిదా చేశాయి. పుష్ప 2, కల్కి 2898 ఏడి.. లాంటి భారీ బడ్జెట్ సినిమాలు అయితే థియేటర్లలో సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, తమిళ్ లోను పలు సినిమాలు రిలీజై సక్సెస్ అందుకున్నాయి. అయితే.. ఈ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకోలేని ఓ రికార్డును అత్యంత తక్కువ బడ్జెట్‌తో రిలీజ్ అయిన సినిమా సొంతం చేసుకుంది. ఆ మూవీ మరేదో కాదు తమిళ్లో తెరకెక్కిన మెయియుఝగన్. ఇక ఈ సినిమానే టాలీవుడ్ లో సత్యం సుందరం పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో మెరుశారు. ఇక సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సింపుల్ స్టోరీ ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. క్లైమాక్స్ అందరితోనూ కంటతడి పెట్టించింది. ఈ క్ర‌మంలోనే సినిమా 8.4 ఐఎండిబి రేటింగ్ తో ఇప్ప‌టివ‌ర‌కు పుష్ప 2, కల్పి సినిమాలు సైతం టచ్ చేయలేకపోయిన రికార్డ్ సొంతం చేసుకుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

ఇండియ‌న్‌ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రిత‌మే...