హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

Date:

Share post:


కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. అలాగే.. భారత్ కూడా అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ మధ్య నేడు కీలక చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఇరుదేశాల డీజీఎంఏల మధ్య భేటీ జరిగింది. ఈ మీటింగ్‌లో భారత్ డిమాండ్లు ఏమై ఉంటాయని సందేహాలు సర్వత్ర వెల్లువాతున్నాయి. భారత మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. రాజీవ్ గాయ్, పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ క‌షిఫ్ చౌద‌రిల మ‌ధ్య‌ మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్స్ చర్చలు మొదలైపోయాయి.

ఇందులో వీళ్ళిద్దరూ పలు అంశాలపై లోతైన చర్చలు ప్రారంభించారు. అయితే.. కాశ్మీర్ అంశంపై మాత్రం వీరు చర్చించడం లేదట‌. ఇంత‌కీ ఈ భేటీలో చర్చిస్తున్న అంశాలు ఏంటంటే.. కాశ్మీర్ చొరబాట్లు, ఆర్మీ కార్యకలాపాల నిలిపివేత, వైమానిక చొరబాట్లు, బార్డర్ తీవ్ర‌వాదాలుపై చర్చలు జరగనున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులను.. భారత్ లోకి పంపించి అమాయక ప్రజలను చంపించడం ఆపాలని భార‌త్‌ డిమాండ్ చేయనుంది. లాంచ్ ప్యాడ్లను మూసివేయాలని.. గ్రౌండ్ భారత్లోకి రాకుండా చూడాలని.. ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని వదలకుండా ఉండాలని.. డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలను పంపడం మానేయాలని భారత డిమాండ్ చేయనుంది.

After Ceasefire, India And Pakistan Top Military Officers DGMO To Meet On  May 12 For Talks

వీటిని పాకిస్తాన్ ఎంతవరకు అంగీకరిస్తుంది అనేదానిపై నెక్స్ట్ చర్చలు లేదా.. యుద్ధం లాంటి నిర్ణయాలు ఆధారపడి ఉండనున్నాయి. ఆపరేషన్ సింధూర్‌ నేపథ్యంలో.. అమెరికా జోక్యంతో.. పాకిస్తాన్ డీజీఎంఏ జనరల్ కషీఫ్‌ చౌదరి.. భారత డీజిఎంఏ రాజీవ్ ఘోయ్‌తో.. కాల్పుల విరమణ పై అభ్యర్థించారు. దీంతో భారత్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం కాల్పుల విరమణ అమల్లోకి రాగా.. అదే రోజు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించి వక్రబుద్ధి చూపించింది. దీనిపై వెంటనే భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. పాకిస్తాన్ సైలెంట్ అయ్యింది. ఈ నేపథ్యంలో నిన్న పరిస్థితి పూర్తి ప్రశాంతంగా కొనసాగింది. ఇవాళ ఇరుదేశాల డీజీఎంఏలు చర్చలు తర్వాత ఏం జరగనుందో.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అనే అంశాలు సర్వత్ర ఆసక్తి నెలకొల్పుతున్నాయి. మరి కొంతసేపు వేచి చూస్తే గాని వీటి పై క్లారిటీ రాదు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...