[ad_1]
నిద్రలేమితో సమస్యే..
నిద్ర ఇంత ముఖ్యమని తెలిసినా నేడు చాలా మంది నిద్రని నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి పని ఒత్తిడి, బిజీ లైఫ్, సోషల్ మీడియా అడిక్షన్, మానసిక, శారీరక సమస్యలు ఏవైనా సరే నిద్ర సరిగ్గా పోవడం లేదు. రోజంతా బిజీగా ఉండేవారు సాయంత్రం కాగానే ఇంటికొచ్చి రిలాక్స్‌గా డిన్నర్ చేసి మళ్ళీ మొబైల్స్ పట్టుకుని వాటితో టైమ్ పాస్ చేస్తున్నారు. దీంతో సరైన సమయంలో నిద్ర రాక అర్ధరాత్రులు దాటాక పడుకోవడం, ఉదయాన్నే లేట్‌గా లేవడం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిదికాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ గుండెపై పడుతుందని చెబుతున్నారు.
నిద్రలేకపోతే గుండె సమస్యలు..
2021లో యూరోపియన్ హార్ట్ జనరల్ డిజిటల్ ఇదే విషయమై ఓ కథనాన్ని ప్రచురించింది. అదేంటంటే.. మనం ఎప్పుడు నిద్రపోతున్నామనేది మన గుండె ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందని అవును.. అధ్యయనాల ప్రకారం, నిద్ర పోయే సమయం గుండె నొప్పుల నుంచి మనల్ని కాపాడగలదు. కానీ, సరైన వేళల్లో నిద్ర పోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది.
Also Read : Brown Rice : బ్రౌన్‌రైస్ ఇలా వండి తింటే రుచితో పాటు బరువు తగ్గుతారు..
పరిశోధనల్లో తేలిన విషయమేంటంటే..
ఇదే విషయమై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇక యూకె బయో బ్యాంక్‌లో 2006, 2010 మధ్య అధ్యయనం కొనాగింది. 61 ఏళ్ళ పైబడిన వారిపై గుండె జబ్బులు, స్ట్రోక్స్, ఇస్కీమిక్ అటాక్, కార్డియో వాస్కులర్ వంటి వాటి గురించి తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం జరిపారు.
ఈ పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే, అర్దరాత్రి దాటాక పడుకునే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం దాదాపు 25 శాతం పెరిగింది.
ఇదే కారణం..
ఏవేవో టైమ్ పాస్ చేస్తూ నిద్ర సరిగ్గా పోకపోవడం, మార్నింగ్ లేట్‌గా లేచి పనులకు హడావిడిగా వెళ్ళడం, ప్రతి పనిలో త్వరత్వరగా అవ్వాలని కంగారు పడడం వల్లే ఆ ఒత్తిడి గుండె సమస్యల రిస్క్ పెంచుతుందని భావిస్తున్నారు నిపుణులు.
రాత్రుళ్లు..
Also Read : Hug Day : హగ్ చేసుకుంటే బీపి కంట్రోల్ అవుతుందా..
ఉదయాన్నే త్వరగా లేస్తే..
రాత్రుళ్ళు త్వరగా పడుకోవడం వల్ల ఉదయాన్నే లేవొచ్చు. దీని వల్లముందుగా లేచి చూస్తే బోలెడు సమయం ఉంటుంది ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇలా రాత్రి 10, 11 గంటలలోపే నిద్రపోయే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, 11 నుంచి అర్ధరాత్రిలోపు నిద్రపోయేవారికి 12 శాతం సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..
యూకెలోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన డాక్టర్ డేవిడ్ ప్లాన్స్ దీనికి కారణాలు కూడా వివరించారు. రోజు సరైన సమయంలో నిద్రపోవడం లేవడం మంచిదని చెబుతున్నారు. శరీర 24 గంటల చక్రంలో నిద్రకి సరైన సమయం రాత్రులే కానీ, అర్ధరాత్రి కాదని చెబుతున్నారు ఈ సమయంలో మొబైల్స్ చూడడం శరీరానికి మంచిది కాదని, ఈ అలవాటు వల్ల శరీర అస్తవ్యస్తంగా మారి ప్రమాదంగా తయారవుతుందని ఆయన చెబుతున్నారు.
నిద్రలేమితో సమస్యలు..
నిద్రలేకపోవడం గుండెకే కాదు. శరీరంలోని ఇతర భాగాలకు కూడా మంచిది కాదు. నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి బరువు పెరగడం, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, రక్తపోటు, షుగర్ వ్యాధి, ఇలా అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నవారవుతాం. కాబట్టి, చక్కగా నిద్రపోయి ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోండని చెబుతున్నారు నిపుణులు.
Also Read : Parkinson : సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా.. ఈ వ్యాధి ఉందేమో..
హ్యాపీగా నిద్రపోయేందుకు…
ఇన్ని తెలిశాక కూడా నిద్రని నిర్లక్ష్యం చేయొద్దు. హాయిగా నిద్రపోండి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం. అది కూడా రాత్రి 10, 11 గంటల్లోపు పడుకోవడం చాలా మంచిది. నిద్రలేమి సమస్యతో బాధపడితే యోగా, ధ్యానం చేయడం చేయండి. మొబైల్స్ దూరం పెట్టండి. సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని కలిసి సలహా తీసుకోండి. హ్యాపీ స్లీప్.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply