హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్ లెక్కలు ఇవే.. నాని కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!

Date:

Share post:


టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా రాణిస్తున్నాడు. అలా తాజాగా నటించిన మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి సిటీ హీరోయిన్గా మెరిసింది. మే డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో నటిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాని.. తన నేచురల్ నటనతో అందరిని కట్టిపడేసాడు.

కానీ.. ఈ సినిమాలో మాత్రం కనివిని ఎరుగని ఊర మాస్ వైలెన్స్ తో ఆడియన్స్‌కు వణుకు పుట్టించాడు. అసలు మనం ఇప్ప‌టివ‌ర‌కు చూసిన నాని.. ఈ నాని ఒక్కడేనా అనేంతగా నటనతో గూస్‌సంప్స్‌ తెప్పించాడు. ఈ క్రమంలో సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతోపాటు.. కలెక్షన్ల పరంగాను సంచలనం సృష్టిస్తుంది. అలా తాజాగా హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.43 కోట్ల వసూలు కొల్లగొట్టినట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

HIT: The 3rd Case (2025) - IMDb

ఇక నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన రెండో సినిమాగా హిట్ 3 సంచలనం సృష్టించింది. ఇక దేశవ్యాప్తంగానే కాదు.. ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఫ్రీ బుకింగ్ లోనే సత్తా చాటుకున్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత అదే జోష్ కొనసాగిస్తుంది. ఓవర్సీస్ లో ఫ‌స్ట్ డే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన హిట్ 3.. వారాంతంలో రెండు మిలియన్ క్లబ్ లోను చేరే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్‌ల‌లోను సంచలనం సృష్టించింది. బుక్ మై షో లో హిట్ ది థర్డ్ కేస్‌ సినిమాకు 24 గంటల్లో రూ.2.72 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం సాధారణ విషయం కాదు. నాని కెరీర్‌లోనే ఒక్కరోజు ఇన్ని టికెట్స్ సేల్‌ అయిన మొదటి సినిమా ఇదే.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...