Friday, July 30, 2021

హెరిటేజ్ కేసు… మంత్రి కన్నబాబు,ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్…

Andhra Pradesh

oi-Srinivas Mittapalli

|

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరుకానందునా వీరిద్దరికీ ఈ వారెంట్ జారీ చేసింది. తదుపరి వాయిదాకు ఇద్దరూ తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

హెరిటేజ్ సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారన్న కారణంతో గతంలో ఆ సంస్థ కన్నబాబు,అంబటి రాంబాబులపై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు ఈ ఇద్దరూ మొదటినుంచి హాజరుకావట్లేదు. ఈ ఏడాది జనవరిలో కేసు విచారణ చేపట్టిన కోర్టు… ఫిబ్రవరి 5న కన్నబాబు,అంబటి రాంబాబు తప్పనిసరిగా కోర్టుకు హాజరవాలని ఆదేశించింది. హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అయినప్పటికీ కన్నబాబు,అంబటి కోర్టుకు హాజరవలేదు. తాజా విచారణ సందర్భంగా కోర్టు ఆ ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు పాటించనందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

nampally court issues non bailable warant to kanna babu and ambati rambabu

హెరిటేజ్ ఫుడ్స్‌పై వైసీపీ నేతలు పలు సందర్భాల్లో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అవాస్తవాలనీ,నిరాధారమని గతంలోనే హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు కొట్టిపారేశారు. 1993-94లో హెరిటేజ్ ఫుడ్స్‌ను స్థాపించినప్పుడు దాని ఆదాయం రూ.4 కోట్లు అని… ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2019-20 నాటికి రూ.2726కోట్లుకు చేరిందని అన్నారు. కంపెనీ పనితీరు,విశ్వసనీయత,క్రమశిక్షణల కారణంగానే హెరిటేజ్ షేర్ విలువ పెరిగిందన్నారు. అంతే తప్ప ఇతర అంశాలేవీ దాన్ని ప్రభావితం చేయలేదన్నారు. ఇప్పటివరకూ హెరిటేజ్ ఏ బ్యాంకుకు పన్ను ఎగవేయలేదని… సకాలంలో రుణఆలను చెల్లిస్తున్నామని తెలిపారు.

మొత్తం 3లక్షల మంది రైతులు హెరిటేజ్ సంస్థకు పాలు విక్రయిస్తున్నారని… 20వేల మంది డిస్ట్రిబ్యూటర్లు,ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. 1500 మంది ట్రాన్స్‌పోర్టర్స్,2వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్,3వేల మంది సిబ్బంది హెరిటేజ్ సంస్థపై ఆధారపడినట్లు చెప్పారు. నిరాధార ఆరోపణలతో రైతుల జీవనాధారాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచించారు.


Source link

MORE Articles

Love marriage: రాత్రి ఇంట్లో భర్త తల నరికి చంపిన భార్య, స్పాట్ లేపేసింది, ఏం జరిగిదంటే ?

హిందూ అమ్మాయి..... ముస్లీం ప్రియుడు తమిళనాడులోని కాంచీపురంలోని గ్రేటర్ కాంచీపురంలో నౌషాద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాంచీపురంలోనే రేవతి అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని...

బిగాస్ నుండి రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు; ఈసారి మేడ్ ఇన్ ఇండియా..

ఈసారి బిగాస్ పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన 2020లో లాంచ్ చేసిన...

Multani Mitti Face Pack : बारिश के मौसम में इस तरह चेहरे पर लगाएं मुल्तानी मिट्टी, ग्लो रहेगा बरकरार, खत्म होंगी ये skin problem

Multani Mitti Face Pack : पूरे देश में मानसून सक्रिय है और झमाझम का बारिश का दौर जारी है. बरसात (Monsoon) आते ही...

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe