News
oi-Mamidi Ayyappa
Flight
News:
GMR
హైదరాబాద్
అంతర్జాతీయ
విమానాశ్రయం
యూరోపియన్
దేశాలకు
మరింత
చేరువ
కానుంది.
ఇందుకోసం
జనవరి
16,
2024
నుంచి
నేరుగా
విమానాల
సర్వీసులను
నడిపేందుకు
అడుగు
ముందుకేసింది.
ఇందుకోసం
ప్రధాన
యూరోపియన్
స్టార్
అలయన్స్
మెంబర్
ఎయిర్‌లైన్
అయిన
లుఫ్తాన్సా
హైదరాబాద్
నుంచి
ఫ్రాంక్‌ఫర్ట్‌కు
నాన్‌స్టాప్
డైరెక్ట్
సర్వీస్‌ను
ప్రారంభించనుంది.
ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్‌కు
లుఫ్తాన్స
తొలి
డైరెక్ట్
ఫ్లైట్
గా
వైడ్
బాడీ
బోయింగ్
B787-9
డ్రీమ్‌లైనర్‌తో
ప్రారంభం
కానుంది.
ఇందులో
26
బిజినెస్
క్లాస్,
21
ప్రీమియం
ఎకానమీ,
247
ఎకానమీ
క్లాస్
సీట్లు
విమాన
ప్రయాణికులకు
అందుబాటులో
ఉంటాయి.

ఎనిమిదిన్నర
గంటల
ప్రయాణ
సమయం
కలిగిన
ఈ
విమానం
ఫ్రాంక్‌ఫర్ట్
–
హైదరాబాద్
విమానాశ్రయాల
మధ్య
వారానికి
మూడుసార్లు
నడవనుంది.
ఫ్రాంక్‌ఫర్ట్
నుంచి
హైదరాబాద్‌కు
మంగళ,
శుక్ర,
ఆదివారాల్లో
నడుస్తుంది.
తిరుగు
ప్రయాణంలో
సోమ,
బుధ,
శనివారాల్లో
హైదరాబాద్
నుంచి
ఉంటుందని
ఫ్లైట్
షెడ్యూల్
చెబుతోంది.
ఈ
కొత్త
ఫ్లైట్
రూట్
తెలంగాణతో
పాటు
సమీప
పరివాహక
ప్రాంతాల
నుంచి
వచ్చే
ప్రయాణికులను
యూరప్‌లోని
అనేక
నగరాలు,
దేశాలు,
ప్రాంతాలతో
కనెక్ట్
చేస్తుంది.
ప్రపంచంలోని
ప్రధాన
విమానయాన
కేంద్రంగా
ఉన్న
ఫ్రాంక్‌ఫర్ట్
ప్రయాణికులను
USA,
కెనడాతో
సహా
ఉత్తర
అమెరికాలోని
అనేక
నగరాలకు
కనెక్ట్
చేస్తుంది.
దీనికి
తోడు
లుఫ్తాన్స
ఫ్రాంక్‌ఫర్ట్
నుంచి
లాటిన్
అమెరికాలోని
అనేక
నగరాలకు
అద్భుతమైన
కనెక్టివిటీని
అందిస్తుంది.
కాబట్టి
మీ
ప్రయాణాన్ని
ఇప్పుడే
ప్లాన్
చేసుకోండి.
English summary
Direct Flight from GMR Hyderabad Airport to frankfurt starts soon, know details
Direct Flight from GMR Hyderabad Airport to frankfurt starts soon, know details
Story first published: Friday, May 26, 2023, 10:12 [IST]