Saturday, May 8, 2021

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య… మొయినాబాద్‌లో మరో యువకుడి బలవన్మరణం…

Telangana

oi-Srinivas Mittapalli

|

హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విభేదాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పెళ్లయిన నాలుగు నెలలకే అతను ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాల్తూరు గ్రామానికి చెందిన నాగవెంకట సత్యభార్గవ్‌ (27) చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అదే జిల్లాకు చెందిన మంజు అనే బంధువుల అమ్మాయిని హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో అతను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ చెన్నైలో కొద్దికాలం ఉన్నారు. ఇదే క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

hyderabad : a software employee committed suicide by hanging himself

ఇరువురి తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పినప్పటికీ గొడవలు సద్దుమణగలేదు. నెల క్రితం చెన్నై నుంచి ఇద్దరూ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. పటాన్‌చెరులోని ఇంద్రేశంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 21న ఇద్దరూ మళ్లీ గొడవపడ్డారు. దీంతో భార్య మంజు పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ మరుసటిరోజు సోదరుడు రవితేజ భార్గవ్ ఇంటికెళ్లగా… లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లగా భార్గవ్ సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో జరిగిన మరో ఘటనలో నవీన్‌కుమార్‌రెడ్డి(29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం చదువు నిమిత్తం కెనడా వెళ్లిన అతను మూడు నెలల క్రితమే తిరిగొచ్చాడు. నవీన్ సోదరుడు అనుదీప్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ డబ్బులతో తల్లిదండ్రులు కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. తమ్ముడు సంపాదిస్తుంటే తాను ఖాళీగా ఉండటం నవీన్‌ను కలచివేసింది. ఉద్యోగం దొరక్కపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇదే క్రమంలో ఆదివారం(ఫిబ్రవరి 21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


Source link

MORE Articles

ఎన్ఎస్ యూఐ మెరుపు ధర్నా.!మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాల వద్ద రచ్చరచ్చ.!

చెరువు భూములు కబ్జా చేసి హాస్పిటల్ నిర్మాణం.. మల్లారెడ్డి ఆసుపత్రిని వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ నాయకులు డిమాండ్...

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

Illegal affair: పబ్లిక్ లో ఫ్లాస్మా టీవీలో రాసలీలల వీడియో, గుండు కొట్టి ఊరేగింపు, అవమానంతో!

ఆమెకు 23 ఏళ్లు త్రిపురలోని సబ్రూమ్ జిల్లాలోని బేటగా గ్రామంలో 23 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. చూడటానికి ఎర్రగా, సన్నగా, నాజుకుగా ఉన్న ఆమె మీద...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe