హైబీపి ఉంటే కిడ్నీలు పాడవుతాయా..

[ad_1]

ఓ సారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే.. వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే, కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుంచి 5 వేల వరకూ ఖర్చవుతాయి. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశఆక కూడా కిడ్నీ హెల్దీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి.

​కిడ్నీ మార్చడం..

దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. ఇది మరీ కష్టం. ఎలాగోలా ఈ ఆపరేషన్ అయితే, ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇన్ని జరిగాక కూడా కొన్ని సార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు.. అందుకే ముందు నుంచే కిడ్నీలు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read : Migraine : ఈ ఆసనాలతో మైగ్రేన్ తలనొప్పి ఇట్టే తగ్గుతుందట..

​షుగర్‌తో ఎఫెక్ట్..

మన దేశంలో రోజురోజుకి షుగర్ వ్యాకధి పెరుగుతూనే వస్తోంది. దీంతోపాటే కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుంచి 30 శాతం, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లమ్ మొదలైతే.. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యని గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ లెవల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి.

Also Read : Mattress : కొత్త పరుపులు కొంటున్నారా.. వీటిని మరువొద్దు..

కిడ్నీల ఆరోగ్యం తెలుసుకునేందుకు టెస్టులు..

టైప్ 1 ఉన్నవారు ఐదేళ్ళకి ఓ సారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాన్ని గుర్తించిన వెంటనే టెస్టులు చేసుకోవాకలి. ఆ తర్వాత కనీసం సంవత్సరానికి ఓ సారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది.

1.మూత్రంలో ఆల్బుమిన్..

ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. మూత్రంలో సుద్ద ఎక్కువగా బయటికి పోతే.. కిడ్నీల ఫిల్టర్ కెపాసిటీ తగ్గుతున్నట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి.

2. బ్లడ్ సిరమ్ క్రియాటిన్..

కిడ్నీల ఫిల్టర్ కెపాసిటీ ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా, వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేట్ గ్లోమెరూలర్ ఫిల్టరేషన్ రేట్-ఈజీఎఫ్ఆర్)ను లెక్కించి, కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మి.లీ వరకూ ఉంటుంది. 60 మి.లీ కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50 శాతం దెబ్బతినేవరకూ ఈ సీరమ్ క్రియాటైన్ పెరగకపోవచ్చు. కాబట్టి, ఈజీఎఫ్ఆర్‌ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్త ప్రకారం చూస్తారు.

Also Read : Walnuts : వాల్‌నట్స్ తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుందా..

​ఏమేం జాగ్రత్తలు..

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్, బీపి కంట్రోల్‌లో ఉండాలి. షుగర్ ఉన్నవారు హెచ్‌బీఏ1సీ 7 కన్నా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హైబీపి కలిసి చివరికీ కిడ్నీలను దెబ్బతీస్తయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి.

  • రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి.
  • మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకుని, రెగ్యులర్‌గా చెకప్స్ చేసుకోవాలి.

-Dr Vikranth Reddy, Consultant Nephrologist, Care Hospitals, Banjarahills

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *