మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటిని తగ్గించుకునేందుకు కొన్ని మెడిసిన్స్ వాడుతుంటాం. అయితే, వాటిని వాడినప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఈ నేపథ్యంలోనే శరీరంలో కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉన్నప్పుడు, వీటి కోసం డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..

నేటి కాలంలో ఆరోగ్య సమస్యలు కామన్ అయిపోయాయి. ఇందులో హై కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడ్ అనేవి సాధారణంగా వచ్చే సమస్యలు. వీటిని కంట్రోల్ చేయడంలో ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు.. మనం వీటిని తగ్గించేందుకు మెడిసిన్స్ తీసుకుంటుంటే కొన్ని ఆహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

లైఫ్‌స్టైల్ డిసార్డర్స్ అంటే ఏంటంటే..

లైఫ్‌స్టైల్ డిసార్డర్స్ అంటే ఏంటి..

​మెడిసిన్ గురించి తెలుసుకోవడం..​

​మెడిసిన్ గురించి తెలుసుకోవడం..​

అయితే, మనం ఆరోగ్య సమస్యలతో బాధపడినప్పుడు ముందుగా, డాక్టర్‌కి వెళ్తాం. వాటి గురించి మెడిసిన్ ఇస్తారు. అయితే, అన్ని కలిపి వేసుకుంటాం. కానీ, ఏ ట్యాబ్లెట్ ఎందుకో అస్సలు తెలుసుకునే ప్రయత్నం చేయరు కొంతమంది. కానీ, ఇది సరికాదు. ఏ ట్యాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి. ఏ సిరప్ దేని గురించి అనేది తెలుసుకోవాలి. ట్యాబ్లెట్స్ గురించి తెలుసుకున్నాక ఏం చేయాలంటే..

​కొలెస్ట్రాల్ మెడిసిన్ తీసుకున్నప్పుడు.​

​కొలెస్ట్రాల్ మెడిసిన్ తీసుకున్నప్పుడు.​

బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కొంతమంది స్టాటిన్స్ వంటి మెడిసిన్స్ తీసుకుంటారు. వీటిని తీసుకున్నప్పుడు ద్రాక్షపండ్లని తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే, ఇవి కొలెస్ట్రాల్‌ని తగ్గించే మందులపై ఎఫెక్ట్ చూపిస్తాయి. అంతేకాకుండా రక్తప్రవాహంలో ఎక్కువగా ఔషధం పేరుకుపోయేలా చేస్తుంది.
Also Read : యాపిల్స్‌ని ఇలా తింటే విషంతో సమానమట..జాగ్రత్త..

​రెడ్ మీట్‌ బదులు..

​రెడ్ మీట్‌ బదులు..

అదే విధంగా, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, రెడ్ మీట్, ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు. వీటి బదులు తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్, బీన్స్, చేపలు, పౌల్ట్రీ, లీన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి.

​హైబీపి మెడిసిన్ తీసుకున్నప్పుడు..

​హైబీపి మెడిసిన్ తీసుకున్నప్పుడు..

బీపి మెడిసిన్ తీసుకున్నప్పుడు అవి ఎక్కువగా మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి. వివిధ రకాల పద్ధతుల ద్వారా మనం సమస్యని తగ్గించుకోవచ్చు.
అయితే, మీరు రక్తపోటును పెంచే సోడియం ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్, రోడ్ సైడ్ జంక్ ఫుడ్, సాల్టీ స్నాక్స్ తగ్గించాలి.
వీటి బదులు పండ్లు, కూరగాయలు, బీన్స్, చికెన్, చేపలని తీసుకోవచ్చు.

​చెడు అలవాట్లకి దూరంగా..

​చెడు అలవాట్లకి దూరంగా..

వీటితో పాటు ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తపోటుని పెంచుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదని గుర్తుపెట్టుకోండి.
Also Read : Iron Rich Foods : వీటిలో కొన్ని తిన్నా ఐరన్ లోపం తగ్గుతుందట..

​హైపోథైరాయిడిజం..​

​హైపోథైరాయిడిజం..​

ఇక థైరాయిడ్‌తో బాధపడేవారు..సోయా ఫుడ్ ప్రోడక్ట్స్ వాడకపోవడమే మంచిది. ఎందుకంటే సోయా ప్రోడక్ట్స్ థైరాయిడ్ మెడిసిన్.. తగ్గిస్తాయి. కాబట్టి, టోఫు, సోయా మిల్క్, వాల్‌నట్స్, యాంటాసిడ్ వంటి సోయా ప్రోడక్ట్స్ వాడకపోవడమే మంచిది.

​విటమిన్ డి తక్కువగా ఉంటే..

​విటమిన్ డి తక్కువగా ఉంటే..

అదే విధంగా, శరీరంలో విటమిన్ డి తక్కుగా ఉన్నప్పుడు కూడా హైపోథైరాయిడ్ వస్తుంది. కాబట్టి.. ముందుగా బాడీలో విటమిన్ డి లెవల్స్‌ని పెంచుకోండి.
థైరాయిడ్ మందులు తీసుకున్న నాలుగు గంటల తర్వాతే ఫైబర్ ఫుడ్స్, పప్పులు, కూరగాయలు తీసుకోండి.
వీలైనంత వరకు సమతుల ఆహారం తీసుకోండి. అంటే మీరు తీసుకునే ప్రతి ఆహారం కూడా పోషకంగా ఉండాలి. ఇందుకోసం కచ్చితంగా న్యూట్రిషనిస్ట్‌ని కలవండి.

​చివరిగా..

​చివరిగా..

ముందుగా చెప్పుకున్నట్లుగానే.. హైబీపి, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌కి మెడిసిన్ వాడుతుంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం మెడిసిన్‌పై ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్‌ చూపించొద్దు. అందుకే మంచి పోషకాహారం తీసుకోవాలి.
-Dr. Dilip Nandamuri, Sr. Consultant Physician and Diabetologist, Yashoda Hospitals, Hyderabad
​​​​గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​Read More :Health NewsandTelugu News



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *