హై యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఈ పండ్లు తినకపోవడమే మంచిది..!

[ad_1]

Fruits Increase Uric acid: యూరిక్‌ యాసిడ్‌ మన రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్‌’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు.. యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. ఒకవేళ విసర్జన సరిగా జరగకపోతే.. యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, డయాబెటిస్‌, హైపోథైరాయిడిజం, గౌట్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కొన్ని రకాల క్యాన్సర్, సోరియాసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది.
NCBI నివేదిక ప్రకారం.. ప్యూరిన్‌’ కారణంగానే కాదు.. ఫ్రక్టోజ్‌ వల్ల కూడా మన రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఫ్రక్టోజ్ జీవక్రియ జరిగినప్పుడు.. హెపాటిక్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్‌గా క్షీణిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్, న్యూక్లియోటైడ్ల విచ్ఛిన్నానికి కారణమవుతుంది. ఫ్రక్టోజ్‌ ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో యూరిక్‌యాసిడ్‌ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు.. ఫ్రక్టోజ్‌ రిఛ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని అంటున్నారు. అనేక పండ్లు, కూరగాయలలో ఫ్రక్టోజ్‌ అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరుగుతాయని అంటున్నారు. యూరిక్‌ యాసిడ్‌ ఫేషెంట్స్‌ తినకూడని పండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పనసపండు..

పనసపండు..

పనసపండును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది చాలా తియ్యాగా, టేస్టీగా ఉంటుంది. ఈ పండులో ఫ్రోక్టోజ్‌ కంటెంట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మైఫుడ్‌డేటా నివేదిక ప్రకారం, 1 కప్పు పనసతొనల్లో.. 15.2 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. యారిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు పనస పండు తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిలో ప్రోక్టోజ్‌ స్థాయిల కారణంగా.. యూరిక్‌ యాసిడ్‌ సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. (Image source – pixabay)

ద్రాక్షపండ్లు..

ద్రాక్షపండ్లు..

ఈ సీజన్‌లో ద్రాక్షపండ్లు ఎక్కువగా దొరుకుతాయి. దీనిలో అధిక మొత్తంలో ఉండే.. విటమిన్‌ సీ, ఫైబర్‌ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. వీటిలో ఫ్రక్టోజ్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఎరుపు, ఆకుపచ్చ రంగు ద్రాక్షలో 12.3 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ద్రాక్షలో రెస్వెరాట్రాల్‌, క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. (Image source – pixabay)

యాపిల్‌..

యాపిల్‌..

రోజుకొక యాపిల్‌ తింటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనకు తెలుసు. యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, ఒక మీడియం సైజ్‌ యాపిల్‌ పండులో 12.5 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. గౌట్‌, యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు.. రోజూ యాపిల్‌ తింటే, వారి పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది.

పియర్‌..

పియర్‌..

మీరు యూరిక్‌ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. పియర్‌ పండు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిలో 11.4 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను పెంచుతుంది.

బ్లూ బెర్రీస్‌..

బ్లూ బెర్రీస్‌..

బ్లూ బెర్రీస్‌లో ఫైబర్‌, విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటాయి. కానీ.. వీటిలో ఫ్రక్టోజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక కప్పు బ్లూబెర్రీస్‌లో 7.4 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. గౌట్‌, యూరిక్‌ యాసిడ్‌ సమస్య ఉన్నవారు.. బ్లూ బెర్రీస్ ఎక్కువగా తింటే మంచిది కాదని నిపుణులు అంటున్నారు. (Image source – pixabay)

అరటిపండు..

అరటిపండు..

అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. అయితే, వీటిలో ఫ్రక్టోజ్‌ కూడా అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్‌ అరటిపండులో 5.7 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది గౌట్‌, యూరిక్‌ యాసిడ్‌ పేషెంట్స్‌కు మంచిది కాదు. (Image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *