Boeing Reward: విమానయానం, రక్షణ రంగం, సాంకేతికత, సామాజిక సమస్యలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఎక్స్‌పర్ట్స్‌కు గుడ్‌న్యూస్‌. 10 లక్షల రూపాయల బహుమతిని గెలుచుకునే అవకాశం మీకు వచ్చింది. డబ్బుతో పాటు పాపులారిటీ కూడా సొంతం అవుతుంది. దీని కోసం మీరు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు, బుర్రకు పదును పెడితే చాలు.

బిల్డ్ ప్రోగ్రామ్ మూడో ఎడిషన్
ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా, తన బిల్డ్ (BUILD) ప్రోగ్రామ్ యొక్క మూడో ఎడిషన్‌ను ప్రారంభించింది. బిల్డ్‌ పూర్తి పేరు ‘బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్’ (Boeing University Innovation Leadership Development). ఈ కార్యక్రమం కింద… ఏరోస్పేస్ & డిఫెన్స్‌, టెక్నాలజీ, సోషల్‌ ఇంపాక్ట్‌, సస్టెయినబిలిటీ వంటి అంశాల్లో వినూత్న ఆలోచనలను బోయింగ్ ఇండియా ఆహ్వానించింది. ఏరోస్పేస్ ఇన్నోవేషన్, లీడర్‌షిప్, టాలెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ఇది, 2019లో ప్రారంభమైంది. 

అప్లై చేయడానికి లాస్ట్‌ డేట్‌
ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న వాళ్లు, ప్రొఫెసర్లు, ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ వ్యవస్థాపకుల కోసం దీనిని రూపొందించారు. ప్రీ-సీడ్ ఐడియా/కాన్సెప్టులైజేషన్ దశలో ఉన్న స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒక విధంగా టాలెంట్‌ హంట్‌ లాంటిది. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం, కొత్త మార్కెట్ అవకాశాలు సృష్టించడం, మన దేశంలో బలమైన స్టార్టప్ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం బిల్డ్‌ లక్ష్యం. 

ఈ ప్రోగ్రామ్‌ కోసం అప్లికేషన్‌ పంపే తేదీ ఈ నెల 12 నుంచి ప్రారంభమైంది, నవంబర్ 10 వరకు గడువు ఉంది. https://www.boeing.co.in/boeing-in-india/build.page లింక్‌ ద్వారా బోయింగ్ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 

మీరు స్టుడెంట్‌ అయి, ఒక టీమ్‌లా ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్‌ చేయాలనుకున్నా అందుకు వీలవుతుంది. అయితే, ఒక టీమ్‌లో గరిష్టంగా ముగ్గురు మాత్రమే ఉండాలి.

7 ఇంక్యుబేషన్ సెంటర్లతో ఒప్పందం
BUILD ప్రోగ్రామ్ మూడో ఎడిషన్ కోసం.. IIT ముంబై, IIT దిల్లీ, IIT గాంధీనగర్, IIT మద్రాస్, IISc బెంగళూరు, T-Hub హైదరాబాద్, KIIT భువనేశ్వర్‌తో బోయింగ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది.

ఏడు జట్లకు అవార్డులు
ప్రారంభంలో వచ్చిన కొన్ని ఆలోచనలను షార్ట్‌లిస్ట్ చేస్తారు. మొత్తం ఏడు ఇంక్యుబేషన్ సెంటర్ల సాయంతో వాటిని ముందుకు తీసుకెళ్తారు. ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఫైనలిస్టులను సబ్జెక్ట్ & ఇండస్ట్రీ నిపుణులు మెంటార్ చేస్తారు. మీ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి, ఉత్పత్తి ప్రతిపాదనగా మార్చడానికి, తగిన ఆకృతి ఇవ్వడానికి నిపుణుల బృందం ఆవిష్కర్తలతో కలిసి పని చేస్తుంది. ఎంపికైన బృందాలకు బోయింగ్ నాలెడ్జ్ లైబ్రరీకి యాక్సెస్‌ దక్కుతుంది.

ఆ తర్వాత, బోయింగ్ ఇమ్మర్షన్ డే సందర్భంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున బహుమతిగా అందజేయడానికి ఏడు వినూత్న ఆలోచనలను నిపుణులు ఎంపిక చేస్తారు. గత సంవత్సరం, 800 పైగా ఐడియాలు ఈ ప్రోగ్రామ్‌ కోసం వచ్చాయి. 1,600 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.

మరో ఆసక్తికర కథనం: హోండా సీబీ300ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ వచ్చేసింది – ధర ఎంత ఉంది? వేటితో పోటీ?

Join Us on Telegram: https://t.me/abpdesamofficialSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *