PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

అదానీ షేర్ల జోరు – నిఫ్టీ 80, సెన్సెక్స్‌ 229 పాయింట్లు అప్‌!

[ad_1]

Stock Market Opening 29 March 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో మొదలయ్యాయి.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 80 పాయింట్లు పెరిగి 17,031 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 229 పాయింట్లు తగ్గి 57,843 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ షేర్లు జోరుమీదున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 57,613 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,572 వద్ద మొదలైంది. 57,569 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,905 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 229 పాయింట్ల లాభంతో 57,843 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 16,951 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,977 వద్ద ఓపెనైంది. 16,976 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,048 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 80 పాయింట్లు పెరిగి 17,031 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 39,611 వద్ద మొదలైంది. 39,609 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,901 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 319 పాయింట్లు పెరిగి 39,887 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమోటో కార్ప్‌, ఐచర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, రిలయన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఇన్ఫీ, సిప్లా షేర్లు నష్టపోయాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎక్కువ ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,670 గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.370 తగ్గి రూ.25,350 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *