PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఆవ నూనె వంటలో వాడితే.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1]

Mustard Oil Benefits: ఆవ నూనె.. ఉత్తర భారతదేశంలో వంటలో ఎక్కువగా దీన్నే వాడతారు. ఘాటన సువాసన ఈ నూనె ప్రత్యకత. ఆవ నూనె వంటకు రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆవ నూనెలో.. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆవ నూనె అనేక వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది. పాత రోజుల్లో చిన్నారులు ఇన్ఫెక్షన్‌కు గురి కాకుండా ఆవనూనెతో మర్దన చేసేవారు. జలుబు వంటివి చేస్తే ముక్కు, చెవులలో ఆవనూనె చుక్కలు వేసేవారు. అవనూనెతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

జలుబు నుంచి ఉపశమనం..

శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఆవ నూనె ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పేరుకుపోవడం, ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందడానికి, వేడినీటిలో కొన్ని చుక్కల ఆవాల నూనె వేసి ఆవిరిని పట్టండి. ఇది కాకుండా, ఆవ నూనెలో వెల్లుల్లి రెబ్బలు వేసి వేడిచేయండి. ఈ నూనెను.. ప్రతిరోజూ పడుకునే ముందు ఛాతీ మీద రాసుకుంటే.. కఫం, శ్లేష్మం కరుగుతుంది.

గుండెకు మంచిది..

NCBI నివేదిక ప్రకారం, ఆవనూనెలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు (MUFA & PUFA), ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్‌ (రక్త ప్రవాహం లేకపోవడం వల్ల వచ్చ గుండె జబ్బలు) ముప్పును 50 శాతం తగ్గిస్తాయి. దీనితో పాటు, ఆవాల నూనె చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ వంటలో, సలాడ్‌లో ఆవనూనె నూనె వేసుకుని తీసుకోవచ్చు.

నోటి ఆరోగ్యానికి మంచిది..

దంత సమస్యలను దూరం చేయడంలో ఆవాల నూనె మేలు చేస్తుంది. ఆవ నూనె వాడి.. చిగురువాపు, పీరియాంటైటిస్ (గమ్ ఇన్ఫెక్షన్) వంటి సమస్యలు దూరం అవుతాయి. దీనితో పాటు, నోటి శుభ్రత కూడా మెరుగుపడుతుంది. అర టీస్పూన్ ఆవాల నూనె, ఒక టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు కలిపి పేస్ట్‌లా రెడీ చేసుకోండి. ఈ పేస్ట్‌తో పళ్లు శుభ్రం చేసుకోండి. ఈ పేస్ట్‌తో వారానికి మూడు సార్లు పళ్లు శుభ్రం చేసుకుంటే.. పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

అర్థరైటిస్‌ నొప్పి మాయం..

ఆర్థరైటిస్, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులను ఉపశమం పొందడానికి ఆవ నూనె సహాయపడుతుంది. ఆవ నూనెలో ఉండే.. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్‌ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వాపును తగ్గించి.. నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అర్థరైటిస్‌ నొప్పి, కీళ్ల నొప్పి తగ్గాలంటే.. చిన్న మంటపై ఆవ నూనె వేడి చేసి.. ప్రభావిత ప్రాంతంలో మసాజ్‌ చేయండి. ఆవ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల కండరాలు, కీళ్ళు నొప్పి తగ్గుతాయి.

క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది..

NIHలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఆవ నూనెలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి పని చేస్తుంది. పెద్దప్రేగు క్యాన్సర్ బారిన పడిన ఎలుకలపై జరిపిన అధ్యయనంలో… ఆవ నూనె క్యాన్సర్‌ కణాలతో పోరాడటంలో ఫ్రభావవంతంగా పని చేస్తుందని స్పష్టమైంది. క్యాన్సర్‌ను నివారించాలంటే.. మీ వంటలో ఆవ నూనె వాడండి.

ఆస్తమా లక్షణాలు తగ్గిస్తుంది..

ఆస్తమా అనేది శ్వాసకోశ సమస్య, ఇది చల్లని వాతావరణంలో మరింత తీవ్రం అవుతుంది. ఆస్తమా పేషెంట్స్‌కు ఆవ నూనె సహాయపడుతుంది. ఇది ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి పనిచేస్తుంది. ఆస్తమాతో బాధపడేవాళ్లు.. వారి డైట్‌లో ఆవాలు, ఆవనూనె తీసుకుంటే మంచిది. ఆవ నూనె సైనస్‌లను తొలగించడానికి ఉపయోగపడుతుంది.

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది..

ఆవ నూనె యాంటీ బాక్టీరియ, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణవ్యవస్థకు రక్షణ కల్పిస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *