PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇన్వెస్టర్లను రక్షించేందుకు రంగంలోకి దిగిన SEBI.. ఇక స్టాక్ బ్రోకర్ల ఆటలు సాగవ్..!


News

oi-Mamidi Ayyappa

|

SEBI News: దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఇన్వెస్టర్ల రక్షణ కోసం కొన్ని చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో వ్యక్తులు శాశ్వత డైరెక్టర్‌షిప్‌ను కలిగి ఉండే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. దీనికి తోడు స్టాక్ బ్రోకర్ల మోసాలను నిరోధించటానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని సెబీ నిర్ణయించింది. బుధవారం జరిగిన సమావేశంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బోర్డు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

మ్యూచువల్ ఫండ్స్ స్పాన్సర్‌లుగా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లను అనుమతించేందుకు వాచ్‌డాగ్ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించింది. ఈ చర్య మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను మరింత లోతుగా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా లిస్టెడ్ కంపెనీల ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ వెల్లడి కోసం నిబంధనలకు రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది.

ఇన్వెస్టర్లను రక్షించేందుకు రంగంలోకి దిగిన SEBI..

లిస్టెడ్ కంపెనీల బోర్డులలో వ్యక్తులు శాశ్వత సీట్లు కలిగి ఉండే విధానాన్ని ముగించాలని సెబీ నిర్ణయించినట్లు బోర్డు సమావేశం తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా వెల్లడైంది. కార్పొరేట్ గవర్నెన్స్ ఎకోసిస్టమ్‌ను మరింత పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీనికి తోడు స్టాక్ మార్కెట్ల ద్వారా జరుగే మోసాలను అరికట్టడం, మార్కెట్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఒక అధికారిక యంత్రాంగాన్ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు సెబీ నిర్ణయించింది.

ఐపీవోల మాదిరిగానే సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం ఫండ్-బ్లాకింగ్ సౌకర్యాన్ని సెబీ ప్రవేశపెడుతోంది. పెట్టుబడిదారుల డబ్బును స్టాక్ బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా రక్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది.

English summary

Market regulator SEBI brining framework to protect investors from brokers frauds

Market regulator SEBI brining framework to protect investors from brokers frauds

Story first published: Thursday, March 30, 2023, 12:14 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *