PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – రికార్డ్‌ సృష్టించిన Bajaj Finance

[ad_1]

Stocks to watch today, 05 January 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 53 పాయింట్లు లేదా 0.30 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,164 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

అదానీ పోర్ట్స్ మరియు సెజ్‌: 2022 డిసెంబర్‌లో 25.1 మిలియన్ టన్నుల కార్గోను ఈ కంపెనీ నిర్వహించింది. 2021 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంతో పోలిస్తే, 2022 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో కార్గో వాల్యూమ్స్‌లో 8% వృద్ధితో, 253 మిలియన్ టన్నుల నిర్వహణను సాధించింది.

బజాజ్ ఫైనాన్స్: తాత్కాలిక గణాంకాల ప్రకారం, 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ NBFC మేజర్ 7.8 మిలియన్ల కొత్త రుణాలు ఇచ్చింది. ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో ఇవి 7.4 మిలియన్లు. గత త్రైమాసికంలో బుక్ చేసిన కొత్త రుణాలు కంపెనీకి రికార్డ్‌ స్థాయి. గత త్రైమాసికం ముగిసే సమయానికి ఏకీకృత నికర లిక్విడిటీ రూ. 12,750 కోట్లతో బలంగా ఉంది.

live reels News Reels

భారతి ఎయిర్‌టెల్: 2025 కాల గడువుతో ఉన్న డాలర్-డినామినేటెడ్ బాండ్లను మార్చడం కోసం 8.35 మిలియన్ షేర్లను ఈ కంపెనీ కేటాయిస్తుంది. ఫిబ్రవరి 7, 2025 నాటికి, ఈ బాండ్లను 5 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లుగా మార్చవచ్చు.

మారికో: 2022 డిసెంబర్ త్రైమాసికంలో, కంపెనీ ఏకీకృత ఆదాయంలో ‘లో సింగిల్ డిజిట్’ YoY వృద్ధిని నమోదు అవుతుందని ఈ FMCG మేజర్ అంచనా వేసింది. స్థూల & ఆపరేటింగ్ మార్జిన్లు YoYలోను, QoQలోనూ మెరుగు పడతాయని ఆశిస్తోంది. నిర్వహణ లాభంలో వృద్ధి పరిమితంగా ఉండవచ్చని అంచనా.

టాటా మోటార్స్: దేశీయ డిమాండ్ బలంగా ఉండటంతో 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ సంస్థ వాహన ఉత్పత్తి 12% (YoY) పెరిగి 2,21,416 యూనిట్లకు చేరుకుంది.

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: తాత్కాలిక డేటా ప్రకారం 2022 డిసెంబర్ 31 నాటికి ఈ బ్యాంక్‌ స్థూల అడ్వాన్సులు QoQలో 7% పెరిగి రూ. 56,335 కోట్లకు చేరుకున్నాయి. రూ.61,101 కోట్లుగా నమోదైన మొత్తం డిపాజిట్లు కూడా QoQలో 5% పెరిగాయి.

RBL బ్యాంక్: తాత్కాలిక డేటా ప్రకారం, డిసెంబర్ 31 నాటికి బ్యాంక్ స్థూల అడ్వాన్సులు YoYలో 14% పెరిగి రూ. 68,371 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్‌గా (QoQ) అడ్వాన్స్‌లు 6% పెరిగాయి. రిటైల్ రుణాలు YoYలో 12%m  మరియు QoQలో 7% పెరిగాయి. టోకు రుణాలు గత సంవత్సరం కంటే 17%, గత త్రైమాసికం కంటే 5% పెరిగాయి.

SJVN: హిమాచల్ ప్రదేశ్‌లోని జల విద్యుత్ ప్రాజెక్టులో ఈ కంపెనీ 2,615 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఈక్విటీ ఇన్ఫ్యూషన్‌ మీద 16.50% రాబడిని పొందుతుంది. ఈ పెట్టుబడి 70% రుణం, 30% ఈక్విటీ రూపంలో ఉంటుంది.
 
M&M ఫైనాన్షియల్: రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి M&M ఫైనాన్షియల్‌కు ఊరట దక్కింది. థర్డ్ పార్టీలతో లోన్ రికవరీ లేదా రీపోస్సెషన్ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ఈ NBFC మేజర్‌ మీద ఉన్న ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *