PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – Tata Motors ఫుల్‌ రైజ్‌లో ఉంది


Stocks to watch today, 11 January 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 25 పాయింట్లు లేదా 0.14 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,011 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

టాటా మోటార్స్: తన అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEML) ద్వారా, సనంద్‌లోని ఫోర్డ్ ఇండియా తయారీ ప్లాంట్‌ను కొనుగోలును టాటా మోటార్స్‌ పూర్తి చేసింది. గుజరాత్‌లోని ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (FIPL) సనంద్ ప్లాంట్‌ను రూ. 725.7 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు గత ఏడాది ఆగస్టులో TPEML ప్రకటించింది, ఇప్పటికి డీల్‌ కంప్లీట్‌ అయింది.

అదానీ విల్మార్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు గరిష్ట ఏకం అంకెలో పెరుగుతాయని ఆదానీ విల్మార్‌ అంచనా వేస్తోంది. పండుగ సీజన్‌లో బలమైన డిమాండ్ & ఔట్‌ ఆఫ్‌ హోమ్‌ వినియోగంతో సేల్స్‌ పెరుగుతాయని నమ్మకంగా ఉంది. స్వతంత్ర అమ్మకాలు గరిష్ట రెండంకెల సంఖ్యలో పెరుగుతాయని కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో, ఈ కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆహార నూనెల ధరల అస్థిరత తక్కువగా ఉంది, సెగ్మెంటల్ వాల్యూమ్ వృద్ధి గరిష్ట ఏక అంకెలో ఉంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అసోంలో 5G నెట్‌వర్క్ సేవలను ప్రారంభించడానికి మరో రూ. 2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కంపెనీ పెట్టుబడులు రూ. 9,500 కోట్లుగా ఉన్నాయి.

అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్: ఇజ్రాయెల్‌కు చెందిన గాడోట్ గ్రూప్‌తో (Gadot Group) కన్సార్టియంలో ఉన్న ఈ కంపెనీ, ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌ను (Haifa Port) 1.15 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది, ఇజ్రాయెల్ ప్రధాన ఓడరేవుల్లో ఒకటి.

ఉత్తమ్ షుగర్ మిల్స్: ఉత్తరప్రదేశ్‌ బర్కత్‌పూర్‌లోని యూనిట్‌లో డిస్టిలరీ సామర్థ్యాన్ని రోజుకు 150 కిలో లీటర్ల నుంచి 250 కిలో లీటర్లకు పెంచడానికి ఉత్తమ్‌ షుగర్‌ మిల్స్‌ రూ. 56 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత సామర్థ్య విస్తరణను 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. వడ్డీ రాయితీ పథకం కింద రుణాలు, అంతర్గత సమీకరణల ద్వారా సామర్థ్య విస్తరణకు నిధులను ఈ కంపెనీ సమకూర్చుకుంటుంది.

PC జ్యువెలర్: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ దేశీయ విక్రయాలు గత ఏడాది డిసెంబర్‌ త్రైమాసికం కంటే 38% పెరిగి రూ. 829 కోట్లకు చేరుకున్నాయి. ఆ త్రైమాసికంలో బీహార్‌లో కొత్త ఫ్రాంచైజీ షోరూమ్‌ను ఈ ఆభరణాల కంపెనీ ప్రారంభించింది.

వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్: ఈ సివిల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షేర్లు, ఒక్కో షేరుకు ప్రకటించిన ప్రత్యేక డివిడెండ్‌ రూ. 7.5కు సంబంధించి, ఇవాళ ఎక్స్‌ డేట్‌. కాబట్టి, ఇవాళ షేర్‌ ధర ఆ మేరకు సర్దుబాటు అవుతుంది.

జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్: ఈ కంపెనీ షేర్లు దాని రైట్స్‌ ఇష్యూకి సంబంధించి 1:1 నిష్పత్తిలో ఎక్స్-రైట్‌లో ఇవాళ ట్రేడ్‌ అవుతాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *