PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ ఆహారం తీసుకుంటే.. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది..!

[ad_1]

Diet for Gastric Cancer: WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 72,300 మంది గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ను కడుపు క్యాన్సర్‌ అని కూడా పిలుస్తారు. మన దేశంలో.. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా.. దక్షిణాది రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువకాలం నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్‌ తినడం వల్ల గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా.. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతుంది. స్మోకింగ్‌, ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.
జీవనశైలి మార్పులు, , హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్, ప్రత్యేకించి కొన్ని జన్యురూపాల (vacAs1, vacAm1, మరియు cagA-పాజిటివ్) కారణంగానూ.. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ సుహాస్ అగ్రే (Dr Suhas Agre, oncologist and hemato-oncologist at the Asian Cancer Institute, Mumbai) అన్నారు.

మహిళలుకు ముప్పు తక్కువ..

పురుషుల కంటే స్త్రీలకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ ముప్పు తక్కువగా ఉంటుందని డాక్టర్ సుహాస్ అగ్రే అన్నారు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నిర్ధారణకు వైద్యులు CT స్కాన్, రక్త పరీక్ష, GI ఎండోస్కోపీ, బయాప్సీని సూచిస్తారు. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి.. చికిత్స తీసుకుంటే త్వరగా నయం అవుతుందని అన్నారు.

లక్షణాలు..

ఆకలి లేకపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది, కడుపునొప్పి, కడుపులో మంట, అజీర్ణం, బరువు తగ్గడం, రక్తపు వాంతులు, తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తక్కువ తిన్నా కడుపు నిండడం వంటివి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు.

గ్యాస్ట్రిక్‌ క్యాన్సర‌ ముప్పును ఇలా తగ్గించుకోండి..

కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చని డాక్టర్ సుహాస్ అగ్రే అన్నారు. కొన్ని పండ్లు, కూరగాయలు తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ను నివారించవచ్చని అన్నారు.

ఈ ఆహారం తీసుకోండి..

గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవడానికి మీ డైట్‌లో కెరోటినాయిడ్లు అధికంగా ఉండే బొప్పాయి, గుమ్మడికాయ, మొక్కజొన్న, గుడ్డు పచ్చసొన, పాలకూర ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్‌ అన్నారు. విటమిన్‌ సీ అధికంగా ఉండే.. కమల, మిరియాలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, బంగాళదుంపలు, క్యాప్సికమ్, టమోటాలు, మామిడి పండ్లు ఎక్కువగా తింటే.. ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు.

విటమిన్‌ సీ..

విటమిన్‌ సీ యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. విటమిన్ సి క్యాన్సర్ కణాలకు హాని కలిగించే ప్రాక్సిడెంట్ ఎఫెక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. విటమిన్ సి, కెరోటినాయిడ్స్‌ వంటి పోషకాలు.. కడుపు క్యాన్సర్‌ను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్ సి, కెరోటినాయిడ్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి, వాటిని నాశనం చేస్తాయి.

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి..

పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు.. 30, 40 శాతం తగ్గుతుంది. సిట్రస్‌ డైట్‌ తక్కువగా తీసుకునేవారికి గ్యాస్ట్రిక్ కార్సినోమాతో వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. . గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు H. పైలోరీతో ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం. హెచ్‌పైలోరీ ఇన్‌ఫెక్షన్‌ను జిఐ ఎండోస్కోపీ ద్వారా గుర్తించవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *