PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ కూరగాయలు మీ డైట్‌లో చేర్చుకుంటే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!


best diabetic diet: డయాబెటిస్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజారోగ్య సమస్య. మన సమాజంలో నూటికి 13 మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. మున్ముందు దీని బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO), భారతీయ వైద్య పరిశోధన మండలి హెచ్చరిస్తున్నాయి. షుగర్‌ వ్యాధి ఒక్కసారి వస్తే.. జీవితాంతం నయం అయ్యే సమస్య కాదు. డయాబెటిక్ పేషెంట్స్‌ రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో లేకపోతే.. కంటి సమస్యలు, కిడ్నీ వ్యాధులు, నాడులు దెబ్బతినటం, పాదాల మీద పుండ్లు పడటం వంటి తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్యే ప్రమాదం ఉంది. మందులతో, జీవనశైలి మార్పులు, పోషకాహారంతో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌ పేషెంట్స్‌ వాళ్లు తీసుకోవలసిన ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ఉండే.. తక్కువ – గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలను మన డైట్‌లో చేర్చుకుంటే.. డయాబెటిస్‌ కంట్రోల్‌ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

కాకరకాయ..

షుగర్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో తరచుగా కాకరకాయ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పాలిపెప్టయిడ్‌-పి, విసైన్‌ రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ స్థాయిని తగ్గించడంలో తోడ్పడతాయి. కాకరకాయలోని పోషకాలు.. ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. కణాలకు శక్తి కోసం గ్లూకోజ్‌ను ఉపయోగించేందుకు సహాయపడతాయి. షుగర్‌ పేషెంట్స్‌కు కంటి సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాకరకాయలోని విటమిన్‌ ఏ కళ్లకు మేలు చేస్తుంది. కాకరకాయలోని యాంటీమైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. పేగుల్లో చేరిన మలినాలు తొలగుతాయి.

బ్రకోలీ..

క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన బ్రోకలీ.. షుగర్‌ పేషెంట్స్‌కు సూపర్‌ ఫుడ్‌ అని చెప్పొచ్చు. దీనిలో గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, నీటి కంటెంట్‌, ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్, ఐరన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రకోలీ మీ డైట్‌లో చేర్చుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే, ఇది మీ గట్ ఆరోగ్యం రక్షిస్తుంది. కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌లో ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పాలకూర..

ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా.. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె1, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, బీటా కెరోటిన్ కూడా ఉంటాయి. పాలకూరలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ వల్ల మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. డయాబెటిస్‌ ఉన్నవారు.. వారి డైట్‌లో పాలకూర తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బీన్స్‌..

మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే శక్తి బీన్స్‌కు ఉంది. ఇవి మీ రక్తప్రవాహంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఫోలేట్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ కె, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీనిలో తక్కువ గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. ఫైబర్‌ అధికంగా ఉంటుంది. (Image source : pixabay)

బెండకాయ..

బెండకాయలో.. పాలీశాకరైడ్‌, ప్లేవనాయిడ్‌ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాల వల్ల.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌ ఉంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బెండకాయను మీ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *