PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఉదయాన్నే మీ చేతులు ఇలా ఉంటే ఈ సమస్య ఉందేమో..


వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలో ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఒకటి. మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది. దీనికి కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే, ఎక్కువ బువు కారణంగా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత బరువు ఉంటే అంతే ప్రమాదం ఉంటుంది. పెరిగిన బరువు కాళ్ళపై ఒత్తిడిని పెంచి సమస్యని తీవ్రంగా మారుస్తుంది. అదే విధంగా కొవ్వు కణజాలం, మీ కీళ్ళలో, చుట్టుపక్కల హానికరమైన మంటను కలిగించే ప్రోటీన్స్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొన్ని కారణాలు..

దెబ్బలు తగలడం, ఆటలు ఆడడం, ప్రమాదంలో తగిలిన దెబ్బలు ఇవన్నీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. కొంతమందికి ఉద్యోగ రీత్యా సమస్య వస్తే.. మరికొంతమందికి కుటుంబంలో ఎవరికైనా ఉంటే సమస్య వస్తుంది. ఇది రోజులు గడిచే కొద్దీ తీవ్రమై కీళ్ళనొప్పులు, కీళ్ళు, మోకాళ్ళు దృఢంగా మారి రోజువారీ పనులని కష్టంగా చేస్తుంది.

WHO ప్రకారం..

who-

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా 60 ఏళ్ళు పైబడిన స్త్రీ, పురుషులిద్దరూ ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్య. ఎక్కువగా చేతులు, మోకాళ్ళపై ఎఫెక్ట్ చూపించే ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని లక్షణాల గురించి తెలుసుకుని ట్రీట్‌మెంట్ తీసుకోవాలని మాయో క్లినిక్ చెబుతోంది.

Also Read : GERD : తిన్న ఆహారం జీర్ణమవ్వక పుల్లని త్రేన్పులు వస్తున్నాయా.. ఈ సమస్య ఉందేమో..

సమస్య ఉంటే..

సమస్య ఉంటే..

ఆస్టియో ఆర్థరైటిస్, డీజెనరేటివ్ జాయింట్ డిసీజ్, వేర్ అండ్ టియర్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఇది ఎముకల చివర్లో కీలులోని మృదులాస్థి క్షీణించడం వల్ల వస్తుంది. రోజులు మారే కొద్ది సమస్య పెరుగుతుంది. మాయో క్లినిక్ ప్రకారం చేతులు, మోకాలు, వెన్నెముకలోని కీళ్ళు ఇబ్బంది పెడతాయి.

ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే ఉదయం స్టిఫ్‌గా మారతాయి జాయింట్స్. ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా నొప్పి, స్టిఫ్‌నెస్, వాపు, చేతుల్లో కీళ్ళ సున్నితత్వం ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు చేతి నొప్పి ఎక్కువగా ఉండడం, కొన్ని సార్లు స్పర్శ లేకపోవడం ఉంటుంది. దీని వల్ల వేళ్ళు వంగిపోవడం జరుగుతుంది. ఆస్టియోఫైట్స్ అని కూడా పిలిచే ఈ సమస్య కీళ్ళలో ఈ పరిస్థితి అదనపు ఎముకలు పెరిగేలా చేస్తుంది.

ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు..

ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు..

ఈ సమస్య లక్షణాలు ఒక్కసారిగా కనిపించవు. రోజులు మారే కొద్దీ పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కీళ్ళలో నొప్పి
దృఢత్వం
సున్నితత్వం
పట్టు కోల్పోవడం
మంటగా అనిపించడం
వాపు
Also Read : Romance for Weight loss : బరువు తగ్గాలా.. ఇలా శృంగారం చేయండి..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కొద్దిగా రిలీఫ్ పొందొచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

యాక్టివ్‌గా ఉండడం
సరైన బరువు
కొన్ని ట్రీట్‌మెంట్స్ తీసుకోవడం
వర్కౌట్స్..

అయితే వర్కౌట్స్‌లో కొన్ని హెల్ప్ చేస్తాయి.
Also Read : Lung Cancer : ఈ 6 జాగ్రత్తలతో లంగ్ క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవచ్చు..

వర్కౌట్స్..

వర్కౌట్స్..

ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారు హ్యాండ్ వర్కౌట్స్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. పిడికిలి బిగించడం వల్ల కీళ్ళ కదలికలు మెరుగ్గా ఉంటాయి. మీ వేళ్ళను స్ట్రెయిట్‌గా పెట్టి పిడికిలి బిగుస్తుండండి. మీ బొటనవేలు చేతి లోపల ఉండాలి. ఇది గట్టిగా చేయకుండా నెమ్మదిగా చేయండి. మళ్ళీ యథస్థానానికి రండి. దీంతో పాటు ఫింగర్ లిఫ్ట్స్ కూడా ట్రై చేయొచ్చు.ఎలా చేయాలంటే మీ అరచేతిని టేబుల్‌పై బోర్లా పట్టండి. నెమ్మదిగా పైకి లేపి వేళ్లని మడిచి తెరుస్తూ ఉండండి. మళ్ళీ యథాస్థానానికి రండి.

ఎవరికి వస్తుందంటే..

ఎవరికి వస్తుందంటే..

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఎవరికి వస్తుందో చూద్దాం.

వృద్ధాప్యం
ఊబకాయం
50 ఏళ్ళు పైబడడం, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి
కుటుంబంలో ఆల్రెడీ ఈ సమస్య ఉన్నవారికి
కీళ్ళ గాయాలు అయినవారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

ఈ సమస్య వచ్చాక కాలక్రమేణా పెరుగుతుంది. గమనించకుండా వదిలేస్తే రోజువారీ పనులు కష్టంగా ఉంటాయి.

ట్రీట్‌మెంట్..

ట్రీట్‌మెంట్..

సమస్య లక్షణాలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ని సంప్రదించాలి. మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్స్ సమస్య ఎంతలా ఉందో చూసి నొప్పుల ప్రభావాన్ని బట్టి మీకు మంచి ట్రీట్‌మెంట్‌ని సజెస్ట చేస్తారు. దీంతో పాటు హెల్దీ లైఫ్‌స్టైల్ చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *