PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఎక్స్‌పైరీ డే రోజు గట్టిగా నిలబెట్టిన మెటల్స్‌ – సెన్సెక్స్‌ 400 డౌన్‌ నుంచి 220+ అప్‌

[ad_1]

Stock Market Closing 29 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. క్రూడాయిల్‌ ధరలు తగ్గినా ఉదయం పతనమైన సూచీలు ఐరోపా మార్కెట్లు తెరిచాక ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 68 పాయింట్ల లాభంతో 18,191 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 223 పాయింట్ల లాభంతో 61,133 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలపడి 82.80 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,910 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,628 వద్ద మొదలైంది. 60,479 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,210 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 400 పాయింట్ల మేర నష్టపోయిన సూచీ చివరికి 223 పాయింట్ల లాభంతో 61,133 వద్ద ముగిసింది.

live reels News Reels

NSE Nifty

బుధవారం 18,122 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,045 వద్ద ఓపెనైంది. 17,992 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,229 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 68 పాయింట్ల లాభంతో 18,191 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీగా లాభపడింది. ఉదయం 42,684 వద్ద మొదలైంది. 42,489 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,498 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 424 పాయింట్లు పెరిగి 43,252 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో క్లోజయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఐచర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, అపోలో హాస్పిటల్స్‌, టైటాన్‌, దివిస్‌ ల్యాబ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు తగ్గాయి. బ్యాంకు, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.




[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *