PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తుందా..? ఎందుకో తెలుసా..?

[ad_1]

Reasons Behind Fatigue: కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా.. నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పుటి నుంచి డల్‌గా పనిచేస్తూ ఉంటారు. చిన్నపని చేయడానికే అలసిపోతూ ఉంటారు. తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతగా నిద్రపోయనా కూడా.. అలసత్వం ఆవరిస్తుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక.. డాక్టర్‌ దగ్గరకు కూడా వెళ్తూ ఉంటారు. చాలా మంది పేషెంట్స్‌ చక్కగా తింటున్నాం.. బీపీ, షుగర్‌ లేదు కానీ, ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్‌కు కంప్లైంట్‌ చేస్తూ ఉంటారు. అసలు.. ఈ నీరసం వెనుక కారణం ఏమిటి..? అనారోగ్యం లేకపోయినా శరీరం నిస్సత్తువ ఎందుకు వస్తుందో వివరిస్తూ.. ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు.. నిధి డాగర్‌ ఇన్‌స్టాగ్ర్‌ పేజ్‌లో ఓ పోస్ట్ షేర్‌ చేశారు.

నీరసానికి కారణాలు

విటమిన్‌ డి లోపం..

మన శరీరంలో విటమిన్‌ డీ లోపించినా.. ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. విటమిన్‌ డీ లోపం వల్ల.. ఎముకల, కండరాల పటుత్వం తగ్గి.. నీరసంగా ఉంటుంది. విటమిన్ డీ లోపాన్ని నివారించడానికి రోజూ ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్‌లో టూనా, సాల్మన్‌, పాలు, తృణధాన్యాలు, గుడ్లు తీసుకోండి.

విటమిన్‌ బి12 లోపం..

-12-

విటమిన్‌ బి13 లోపం కారణంగానూ.. నీరసం ముంచుకొస్తుంది. విటమిన్‌ బి12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తులతోనే లభిస్తుంది. అందుకే శాకాహారుల్లో చాలామందిలో దీని లోపం కనబడుతుంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ మన శరీరం విటమిన్‌ బి12ను గ్రహించుకోవటమూ తగ్గుతుంది.

నిశ్చల జీవనశైలి..

నిశ్చల జీవనశైలి.. విపరీతమై అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల.. నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి.. మీ మంచి లైఫ్‌స్టైల్‌ ఫాలో అవ్వండి.

నీళ్లు తాగకపోయినా..

రోజూ తగినన్ని నీళ్లు తాగకపోయినా.. నీరసంగా అనిపిస్తుంది. తగినన్ని నీళ్లు తాగకపోతే.. డీహైడ్రేషన్‌కు గురవుతారు. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

జంక్ ఫుడ్..

నూడిల్స్, బర్గర్, స్వీట్లు… ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినేవాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. శుద్ధి చేసిన ఆహారం తీసుకున్నా అలసటగా ఉంటుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు.. రక్తంలో చక్కర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది.

ఎనర్జీ డ్రింక్స్‌ ఎక్కువగా తాగినా..

ఎనర్జీ డ్రింక్‌లో కెఫిన్ ఉంటుంది, ఇది తాత్కాలిక శక్తిని ఇస్తుంది. కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు నిపుణులు.

ప్రొటీన్ లోపం..

మన శరీరంలో మెటబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రొటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రొటీన్లు లేకపోతే.. త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *