PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఎయిర్‌టెల్‌ ఖాతాదార్లకు షాక్‌, మాట్లాడాలంటే మినిమమ్‌ రూ.155 కట్టాల్సిందే

[ad_1]

Airtel Tariff Hike: కోట్లాది మంది సామాన్య ప్రీ పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు భారతి ఎయిర్‌టెల్ ‍‌(Bharati Airtel) షాక్‌ ఇచ్చింది. మొబైల్ టారిఫ్‌ పెంచుతూ ఈ టెలికాం కంపెనీ  నిర్ణయం తీసుకుంది. అది కూడా చిన్న మొత్తం కాదు, ఏకంగా 57 శాతం ధర ఒక్కసారే పెంచేసింది. 

మొన్నటి వరకు ఎయిర్‌టెల్‌ మినిమమ్‌ ప్రీ పెయిడ్‌ ప్లాన్‌గా ఉన్న రూ. 99 ప్లాన్‌ను కంపెనీ రద్దు చేసింది. దాని స్థానంలో ఇప్పుడు రూ. 155 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అంటే, ఇప్పుడు మినిమమ్‌ ప్లాన్‌ కోసం రీఛార్జ్ చేసుకోవాలంటే వినియోగదారులు రూ. 99 కి బదులు రూ.155 చెల్లించాలి. ఏడు సర్కిళ్లలో కనీస నెలవారీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

రూ.155 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్‌
అయితే రూ. 99 ప్లాన్‌ కంటే రూ. 155 ప్లాన్‌లో కొన్ని సౌకర్యాలు పెంచింది. ఎయిర్‌టెల్ ఈ పాత రూ. 99 రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు పరిమిత టాక్ టైమ్ మాత్రమే పొందుతారు. ఆ కాల్ పరిమితి తర్వాత ఇక ఆ సిమ్‌ నుంచి ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ వెళ్లవు. పరిమిత కాల్స్‌ను ప్లాన్‌ ధరతో పోలిస్తే.. ఒక్కో సెకన్‌ కాలింగ్‌ 2.5 పైసలు ఖర్చయ్యేది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ 28 రోజులకు కలిపి కేవలం 200 MB మొబైల్‌ డేటా అందించింది. 

కానీ, రూ. 155 కొత్త రీ ఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. దీని చెల్లుబాటు వ్యవధి కూడా 28 రోజులు. ఈ ప్లాన్‌తో రీ ఛార్జ్‌ చేసుకుంటే, 28 రోజుల చెల్లుబాటు వ్యవధిలో ఆ సిమ్‌ నుంచి ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. దీంతో పాటు.. ఒక GB (1 GB) ఇంటర్నెట్ డేటా & 300 SMSల సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు హలో ట్యూన్‌, వింక్‌ మ్యూజిక్‌ సేవలు ఉచితంగా అందిస్తోంది.

news reels

ఆంధ్రప్రదేశ్‌ సహా 7 సర్కిళ్లలో..
గత ఏడాది నవంబర్‌లోనే రూ. 99 కనీస నెలవారీ ప్రీ పెయిడ్ రీ ఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసిన కంపెనీ, మొదట హరియాణా, ఒడిశాలో రూ. 155 ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. అక్కడి ప్రజల స్పందన చూసి ఓకే అనుకున్నాక, ఇప్పుడు ఈ మరో ఏడు సర్కిళ్లలో విడుదల చేసింది. ఆ ఏడు సర్కిళ్లు.. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ పశ్చిమ, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలు.

ఎయిర్‌టెల్ వెల్లడించిన ప్రకారం… కస్టమర్లకు  మెరుగైన అనుభవాన్ని అందించడానికి మీటర్ టారిఫ్‌లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అందుకోసమే రూ. 99 స్థానంలో రూ. 155 కొత్త ఎంట్రీ లెవల్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. సబ్‌స్ర్కైబర్లు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ ప్లాన్‌ని ఉపయోగించగలరని, ఈ ప్లాన్ మరింత అనువైనది, మరింత విలువైనది నమ్ముతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

అయితే, రూ. 155 ప్లాన్‌ కింద రీ ఛార్జ్‌ చేసుకోవాలని చూసిన వాళ్లకు, కొన్ని ప్రి పెయిడ్‌ ఫోన్‌ నంబర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, మరికొన్ని ఫోన్ నంబర్లకు 24 రోజుల వ్యాలిడిటీ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. దీంతో.. ఖాతాదార్లు అయోమయానికి గురవుతున్నారు. 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *