PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఎసిడిటీ వేధిస్తుందా..? ఈ ఫుడ్‌ తింటే ఉపశమనం లభిస్తుంది..!


What To Eat In Acidity: ఎసిడిటీ సాధారణంగా.. నూనె, మాసాల ఆహారం ఎక్కువగా తీసుకోవడం, అతిగా తినడం, ఫైబర్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. దీన్ని మెడికల్‌ టెర్మ్‌లో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) అని పిలుస్తారు. ఎసిడిటీ వల్ల.. పుల్లటి త్రేనుపు, గొంతులో పుల్లని నీరు రావడం, ఛాతీలో మంట, త్రేనుపుతో గొంతులో ఆహారం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసిడిటీ సమస్యకు ఆమ్లాన్ని తగ్గించే యాంటాసిడ్‌ మందులు వేసుకుంటుంటారు. వీటిని దీర్ఘకాలం వాడితే విటమిన్‌ బి12, క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాల లోపానికి దారితీయొచ్చు. ఫలితంగా గుండె వేగం అస్తవ్యస్తం కావటం, న్యుమోనియా, ఎముకలు గుల్లబారటం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ సమస్యను దూరం చేయడానికి.. కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్‌ బాత్రా అన్నారు.

అన్నం..

ఎసిడిటీ సమస్యను దూరం చేయడానికి.. అన్నం, పాస్తా వంటి.. బ్లాండ్ స్టార్చ్ ఫుడ్స్‌ బెస్ట్‌ ఆప్షన్స్‌. ఈ ఆహార పదార్థాలు.. కడుపు లైనింగ్‌ను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. వీటిలో.. ఫైబర్‌, ప్రిబయోటిక్స్‌ గుండెల్లో మంట వంటి లక్షణాలను తగ్గించడానికి అన్నం సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి.

అరటిపండు..

అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం శరీరంలో యాసిడ్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. అరటి పండు ఆల్కలీన్‌ ఫ్రూట్‌, దీనిలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీతో బాధపడేవారు.. అరటిపండు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అరటిపండు వల్ల మలబద్ధకం కూడా దూరం అవుతుంది.

కీరా..

కీరా దోసకాయ.. ఆల్కలీన్‌ వెజిటేబుల్‌, ఇది శరీరంలో pH స్థాయిని పెంచి.. ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే, కీరా దోసలో 95% నీరు ఉంటుంది. కీరా దోస తీసుకుంటే.. డీహైడ్రేషన్ లక్షణాలను కూడా దూరం చేస్తుంది.

సబ్జా..

శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచేందుకు సబ్జా గింజలు పని చేస్తాయి. ఎసిడీటీ, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సబ్జా సహాయపడుతుంది. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే.. కడుపులోని అదనపు ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

క్యారెట్‌..

క్యారెట్‌లో స్టార్చ్‌ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఫైబర్‌ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇవి గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎసిడిటీతో బాధపడేవారు.. క్యారెట్‌ ఉడికించి తిసుకుంటే మంచిది.బంగాళాదుంప, క్యారెట్, బీట్‌రూట్‌ వంటి వేరు కూరగాయలను తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ దూరం అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *