PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఏపీకి పెట్టుబడుల వెల్లువ, జీఐఎస్ లో రూ.7.44 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్


AP Global Investors Summit 2023 : ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) విశాఖలో గ్రాండ్ గా మొదలైంది. దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీఐఎస్ తొలి రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొదటిరోజు(మధ్నాహ్యం 1.30) ఇప్పటి వరకూ రూ.7,44,128 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.   

 తొలిరోజు పెట్టుబడులు 

1.ఎన్టీపీసీ-రూ.2,35,000 కోట్లు

2.యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ – రూ.1,20,000 కోట్లు 

3.రీన్యూ పవర్ -రూ.97,500 కోట్లు

4.ఇన్డోసాల్-రూ.76,033 కోట్లు

5.సెరింటికా రెన్యూవబుల్ -రూ.12,500 కోట్లు

6.అవడా గ్రూప్- రూ. 15,000 కోట్లు

7.ఎకోరెన్ ఎనర్జీ ఇండియా- రూ. 10,500 కోట్లు

8.ఆదిత్య బిర్లా – రూ.7,305 కోట్లు

9.అదానీ గ్రీన్ ఎనర్జీ- రూ. 21,820 కోట్లు

10.అరబిందో గ్రూప్ -రూ.10,365 కోట్లు

11.శ్యామ్ మెటల్స్ – రూ.7,700 కోట్లు

12.శ్రీ సిమెంట్స్ – రూ.5,500 కోట్లు

13.షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- రూ. 8,855 కోట్లు

14.గ్రీన్కో- రూ. 47,600 కోట్లు

15.జిందాల్ స్టీల్ & పవర్-రూ. 7,500 కోట్లు

16.మోండలెజ్-రూ. 1,600 కోట్లు

17.ఒబెరాయ్ గ్రూప్-రూ. 1,350 కోట్లు

18.హచ్ వెంచర్స్-రూ. 50,000 కోట్లు

19.రెనికా-రూ. 8,000 కోట్లు

మొత్తం పెట్టుబడులు -రూ. 7,44,128 కోట్లు


ఏపీలో రిలయన్స్ గ్రూప్ పెట్టుబడులు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ ఏపీలో పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు.  

ఏపీలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ పెట్టుబడులతో 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి యువతకు ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ విశాఖ జీఐఎస్ సదస్సులో తెలిపారు. ఏపీకి రూ.13 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులతో అధిక మానవ వనరుల శక్తి ఏపీ కలిగి ఉందని సీఎం  జగన్ పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం చెప్పారు. 

ఏపీ లో జిందాల్ గ్రూప్ పెట్టుబడులు

ఏపీలోని క్రిష్ణపట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ అంగీకారం తెలిపారు. ఇందుకోసం రూ.10వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు జీఐఎస్ లో ప్రకటించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.  

ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రం – నవీన్ జిందాల్

అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌తో జిందాల్ గ్రూప్ నకు సంబంధాలు ఉన్నాయని నవీన్ జిందాల్ తెలిపారు. సానుకూల అనుభవాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తామన్నారు. ఏపీలోని అద్భుతమైన మౌలిక సదుపాయాలు, భారీ తయారీ కేంద్రాలు, ప్రతిభావంతులైన యువత, అద్భుతమైన  వ్యాపార అనుకూల వాతావరణం కలిగి ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టి నాయకత్వం, ప్రభుత్వ విధానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు నవీన్ జిందాల్.  





Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *