PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారా..? ఈ అలవాట్లు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయ్..!

[ad_1]

వ్యాయామం చేయండి..

వ్యాయామం చేయండి..

ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి.. వ్యాయామం ఉత్తమమైన మార్గం. ఇది ఎండార్ఫిన్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, ఆందోళను తగ్గించే.. సంతోష అనుభూతిని ఇచ్చే కెమికల్స్‌. ఎక్స్‌అర్‌సైజ్‌ ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది.

(image source – pixabay)​

రోజూ ఒక గ్లాస్‌ ఈ జ్యూస్‌ తాగితే.. బెల్లీ ఫ్యాట్‌ ఈజీగా కరుగుతుంది..!

ప్రశాంతంగా నిద్రపోండి..

ప్రశాంతంగా నిద్రపోండి..

స్ట్రెస్‌ లెవల్స్‌ తగ్గించుకోవడానికి ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం. మనకు తగినంత నిద్ర లేనప్పుడు, మనకు చిరాకు, అలసట, ఆందోళనగా ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల కార్టిసాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి, ఇది ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రతి రోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. (image source – pixabay)​

పీరియడ్స్‌ టైమ్‌లో ఈ 5 తప్పులు చేస్తే.. నొప్పులు ఇంకా ఎక్కువవుతాయి..!

మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టిస్‌ చేయండి..

మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టిస్‌ చేయండి..

మైండ్‌ఫుల్‌నెస్ అనేది ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించడం, మన ఆలోచనలు, భావాలను తెలుసుకోవడం వంటి టెక్నిక్. ఇది ప్రతికూల ఆలోచనలను దూరం చేయడానికి తోడ్పడుతుంది.

(image source – pixabay)

ఇతరులతో సన్నిహితంగా ఉండండి..

ఇతరులతో సన్నిహితంగా ఉండండి..

ఒత్తిడిని తగ్గించడంలో సామాజిక మద్దతు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. భావోద్వేగ మద్దతును అందించడానికి, ఒంటరితనాన్ని దూరం చేయడానికి స్నేహితులు, ప్రియమైనవారితే కనెక్ట్‌ అవ్వాలని గుర్తుంచుకోండి. (image source – pixabay)

ప్రాణాయామం, మెడిటేషన్‌ ప్రాక్టిస్‌ చేయండి..

ప్రాణాయామం, మెడిటేషన్‌ ప్రాక్టిస్‌ చేయండి..

ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి ప్రాణాయమం, మెడిటేషన్‌ సహాయపడతాయి. మన శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల.. మనం విశ్రాంతిని ప్రోత్సహించవచ్చు, ఆందోళన తగ్గించవచ్చు. మెడిటేషన్‌ మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

(image source – pixabay)

Thyroid Issues: థైరాయిడ్‌లో వచ్చే.. 4 సాధారణ సమస్యలు ఇవే..!

డిజిటల్‌ స్క్రీన్‌కు దూరంగా ఉండండి..

డిజిటల్‌ స్క్రీన్‌కు దూరంగా ఉండండి..

ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి టెక్నాలజీ కారణంగా మారింది. రోజు మొత్తం కంప్యూటర్‌, ఫోన్‌ను వాడుతూనే ఉంటున్నారు. కొంత సేపు ఫోన్‌, కంప్యూటర్‌ ఆఫ్‌ చేసి.. టెక్నాలజీ నుంచి కొంత విరామం తీసుకోండి. ఈ అలవాటు మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది, విశ్రాంతిని ప్రోత్సహించడంలో తోడ్పడుతుంది. (image source – pixabay)


గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *