PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కడుపులో అల్సర్స్‌ ఉంటే.. తినాల్సిన ఆహారం ఇదే..!


Stomach ulcers: ఈరోజుల్లో మన లైఫ్‌స్టైల్‌ అస్తవ్యస్తంగా ఉంటుంది. బిజీబిజీగా గడపడం, సమయానికి భోజనం చేయకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, సరిగ్గా నిద్రపోకపోవడం, చెడు ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. వీటిలో కడుపులో అల్సర్లు ఒకటి. ప్రస్తుతం చాలా మందిని కడుపు అల్సర్ల సమస్య వేధిస్తోంది. ఆల్కహాల్‌, స్మోకింగ్‌, కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, మసాలా ఆహారం ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపులో అర్సర్లు ఏర్పడతాయి. కడుపులో అల్సర్లు ఉంటే.. తీవ్రమైన మంట, కడుపు నొప్పి వేధిస్తుంటుంది. ఆహారం తిన్నా, తినకపోయినా.. కడుపు నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకసారి అల్సర్‌ వస్తే అది మళ్లీ మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అల్సర్‌ వచ్చినవాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అల్సర్లతో బాధపడే వాళ్లు, ఒకసారి అల్సర్ల బారిన పడిన వాళ్లు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అల్సర్లు తగ్గడానికి, రాకుండా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారానికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

అల్సర్లు ఎలా ఏర్పడతాయి…

మన నోటిలో ఉండే మృదువైన పొరను మ్యూకోజా అంటారు. ఆ పొరలాంటి లైనింగ్‌లాంటిదే దాదాపు ఆహారం ప్రయాణించే మార్గమంతా ఉంటుంది. మ్యూకోజా ఆహారం సజావుగా వెళ్లడానికి, పోషకాలు లోపలికి ఇంకడానికి సహాయపడుతుంది. ఆ దారిలో ఒరుసుకుపోతే.. వాటిని ఎరోజన్స్‌ అంటారు. ఈ గాట్లు మరింత లోతుగా ఉంటే వాటిని అల్సర్స్‌ అంటారు. కడుపులో వచ్చే వాటిని కడుపు అల్సర్స్‌ అని పిలుస్తారు. కడుపులో స్రవించే యాసిడ్‌ లోపలి లైనింగ్‌ను తినేయడం, సమయానికి తినకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి కారణాల వల్ల మ్యూకోజా దెబ్బతింటుంది.

ఈ లక్షణాలు ఉంటాయి..

ఈ లక్షణాలు ఉంటాయి..

కడుపులో అల్సర్స్‌ ఉంటే సాధారణంగా కడుపునొప్పి వస్తుంది. కడుపునొప్పితోపాటు ఈ లక్షణాలు కనిపిస్తాయి.

  • అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి, మంట రావడం.
  • కాస్తంత తినగానే కడుపునిండినట్లు అనిపించడం.ఏమీ తినకపోతే కడుపునొప్పి రావడం.
  • ఏదైనా తినగానే వాంతులు కావడం, నొప్పి రావడం.కడుపు ఉబ్బరం, తేన్పులు.
  • కొందరిలో రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

కాఫీ..

 కాఫీ..

కాఫీలో కెఫిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది మ్యూకోజా పొరను దెబ్బ తీస్తుంది. దీని కారణంగా వాపు, రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. కెఫిన్‌ యాసిడ్‌ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా.. అల్సర్‌ వ్యాధి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

చాక్లెట్..

చాక్లెట్..

చాక్లెట్‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ, అల్సర్లతో బాధపడేవారు చాక్లెట్‌కు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది అల్సర్‌ ఉన్నవారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీ అల్సర్లు నయం అయ్యే వరకు పూర్తిగా చాక్లెట్లకు దూరంగా ఉండండి.

మసాలాలు..

మసాలాలు..

మసాలా ఆహారం అల్సర్లకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. అల్సర్లతో బాధపడేవారు మసాలాలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎసిడిక్‌ ఆహారం..

ఎసిడిక్‌ ఆహారం..

అల్సర్లతో బాధపడేవాళ్లు.. సిట్రస్‌ పండ్లు, టమాటాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. సిట్రస్‌ పండ్లు కడుపు నొప్పిని తీవ్రం చేస్తాయి. కడుపులో పుండ్లను పెంచుతాయి. బయటి ఆహారం తీసుకోవద్దు. నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడి నీటిని తాగొద్దు. కారం, మసాలాలు ఎక్కువగా తినొద్దు.

ఈ ఆహారం తీసుకోండి..

ఈ ఆహారం తీసుకోండి..

క్యారెట్‌..

అల్సర్లతో బాధపడేవారు వారి డైట్‌లో క్యారెట్‌ తరచుగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్‌లోని విటమిన్‌ ఏ.. మ్యూకోజా పొరను రక్షిస్తుంది.

క్యాప్సికమ్‌..

క్యాప్సికమ్‌..

క్యాప్సికమ్‌లో విటమిన్‌ సీ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్‌ సి లోపం ఉన్నవారిలో అల్సర్లు ఎక్కువగా వస్తాయి.

గుమ్మడికాయ..

గుమ్మడికాయ..

గుమ్మడికాయ అల్సర్లకు ఔషధంలా పనిచేస్తుంది. ఇది డ్యూడెనల్ అల్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్, లోపలి కడుపు లైనింగ్ కార్యాచరణను పెంచుతుంది. అల్సర్‌ పేషెంట్స్‌ గుమ్మడికాయ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా తినండి..

ఇలా తినండి..

అల్సర్‌ పేషెంట్స్‌ పూర్తి సాత్విక భోజనం తీసుకోవాలి. చప్పటి ఆహారం తీసుకుంటే అల్సర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. ఆకుకూర, పప్పును తాలింపు వేసుకొని తినాలి. పెరుగు, మజ్జిగలోని ప్రోబయోటిక్స్‌ అల్సర్లు తగ్గడానికి సహాయపడతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *