PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

కనక వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్‌ – రిస్క్‌ కూడా సేమ్‌ గురూ!

[ad_1]

Penny Stocks: ప్రస్తుతం, పెన్నీ స్టాక్స్‌ భారీ ఊపులో ఉన్నాయి. అనూహ్యమైన లాభాల కోసం ఇన్వెస్టర్లు వీటి కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం (2022 ఏప్రిల్ 1) నుంచి.. 150 పెన్నీ స్టాక్స్‌ కనీసం 200% నుంచి 2,000% మధ్య ర్యాలీ చేశాయి. 

సాధారణంగా, 10 రూపాయల లోపు విలువైన స్టాక్స్‌ను పెన్నీ స్టాక్స్‌గా మార్కెట్‌ పరిగణిస్తోంది, దీనికంటూ నిర్దిష్టమైన నిర్వచనం ఇప్పటి వరకు లేదు.

ఆదాయం లేకపోయినా పరుగో పరుగు
కొందరు మోసగాళ్ల (మార్కెట్‌ ఆపరేటర్లు) ‘పంప్ అండ్ డంప్ స్కీమ్స్‌’లో‍‌ (pump & dump schemes) కొన్ని పెన్నీ స్టాక్స్‌ భాగంగా మారుతున్నందున, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Sebi) వీటిపై నిఘా పెట్టింది. అయినా, ఈ కౌంటర్లలో జరిగే చాలా కార్యకలాపాలు అనుమానాస్పదంగానే ఉన్నాయని బ్రోకర్లు చెబుతున్నారు.

గత సంవత్సరంలో విలువ భారీగా పెరిగిన చాలా కంపెనీల షేర్లకు సంబంధించి, ఆయా కంపెనీల ఆదాయం & లాభం చాలా తక్కువగా ఉంది. లేదా, అవి ఒక్క రూపాయి లాభం కూడా సంపాదించలేదు.

ఉదాహరణకు.. సాఫ్ట్‌రాక్ వెంచర్ ఇన్వెస్ట్‌మెంట్ ‍‌(Softrak Venture Investment) నవంబర్ 2022లో లిస్ట్‌ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3,368% ర్యాలీ చేసింది. డిసెంబర్ 2022తో ముగిసిన గత 12 నెలల్లో ఈ కంపెనీ ₹10 లక్షల నికర లాభంతో ₹25 లక్షల ఆదాయాన్ని పోస్ట్‌ చేసింది. బోహ్రా ఇండస్ట్రీస్ ( Bohra Industries) కూడా 2022 అక్టోబర్‌లో లిస్ట్‌ అయింది, అప్పటి నుంచి 1,823% పెరిగింది. మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈ ₹1.37 కోట్ల ఇతర ఆదాయాన్ని  & ₹2.62 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది.

శ్రీ గ్యాంగ్ ఇండస్ట్రీస్ (Shri Gang Industries), గత 12 నెలల్లో ₹7 కోట్ల లాభంతో ₹113 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్‌ 1,911% లాభపడింది. గత ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ నెలల మధ్య ఈ స్టాక్ దాదాపు 8,800% ర్యాలీ చేసింది, ₹2.71 నుంచి ₹242.55 కి పెరిగింది. ఆ తర్వాత, గరిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు 74% క్షీణించింది. అంటే, పెన్నీ స్టాక్స్‌ లాభం ఏ స్థాయిలో ఉంటుందో రిస్క్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది.

మెర్క్యురీ మెటల్స్, S&T కార్ప్, కర్ణావతి ఫైనాన్స్, K&R రైల్ ఇంజినీరింగ్, టైలర్‌మేడ్‌ రిన్యూ, అస్కామ్‌ లీజింగ్, రీజెన్సీ సెరామిక్స్ వంటి షేర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 1,000% పైగా ర్యాలీ చేశాయి.

“చాలా పెన్నీ స్టాక్స్‌లో చాలా నెలలుగా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయి. గత 17 నెలలుగా మార్కెట్ నుంచి ఎలాంటి లాభాలు రాకపోవడంతో, చాలా మంది కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు తమ దృష్టిని మార్కెట్‌లోని వివిధ రకాల ట్రేడింగ్స్‌ వైపు మళ్లించారు. మార్కెట్, పెట్టుబడి గురించి పెద్దగా అవగాహన లేని కొత్త రిటైల్ పెట్టుబడిదారుల్లో చాలా మంది మార్కెట్‌ ఆపరేటర్ల వలలో చిక్కుతున్నారు” – విజయకుమార్, ప్రధాన పెట్టుబడి వ్యూహకర్త, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్.

సాధ్నా బ్రాడ్‌కాస్ట్ & షార్ప్‌లైన్ బ్రాడ్‌కాస్ట్ షేర్ల గురించి తప్పు దారి పట్టించే సమాచారాన్ని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసి, వాటి ధరలను కృత్రిమంగా పెంచి, ఆ తర్వాత ఆ షేర్లను అమ్మి అక్రమంగా లాభపడినందుకు బాలీవుడ్‌ నటుడు అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టి సహా 55 సంస్థలను ఇటీవలే సెబీ నిషేధించింది.

పన్ను ఎగవేతల కోసం..
నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి కూడా పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడులను ఉపయోగిస్తునట్లు గతంలో వెలుగు చూసిన కొన్ని సంఘటనలు చెబుతున్నాయి.

పన్ను ఎగవేత కోసం  లిక్విడ్ స్టాక్ ఆప్షన్స్‌ ట్రేడింగ్ చేస్తున్న 10,000 మందిని FY19లో సెబీ గుర్తించింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *