PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గంటలో రూ.4 లక్షల కోట్ల లాభం! సెన్సెక్స్‌ 840+ అప్‌!


Stock Market Opening 09 January 2023: 

భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. కేవలం గంటలోనే మదుపర్లు రూ.4 లక్షల కోట్లు ఆర్జించారు.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 243 పాయింట్ల లాభంతో 18,102  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 846 పాయింట్ల లాభంతో 60,746 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 59,900 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,147 వద్ద మొదలైంది. 60,109 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,759 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 846 పాయింట్ల లాభంతో 60,746 వద్ద కొనసాగుతోంది.

News Reels

NSE Nifty

శుక్రవారం 17,859 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,952 వద్ద ఓపెనైంది. 17,936 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,108 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 243 పాయింట్ల లాభంతో 18,102 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,404 వద్ద మొదలైంది. 42,186 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,586 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 336 పాయింట్లు పెరిగి 42,525 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 47 కంపెనీలు లాభాల్లో 3 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, బజాజ్‌ ఆటో, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.






Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *