PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ ఉన్నవారు నాన్‌ వెజ్‌ తినొచ్చా..?


Gallstones diet: ఈ మధ్యకాలంలో పిత్తాశయంలో రాళ్ల((Gall bladder stones) సమస్య పెరుగుతోంది. గాల్‌స్టోన్స్‌ చిన్నగా ఉంటే పెద్ద సమస్య ఉండదు కానీ, వీటి పరిమాణం పెద్దగా ఉంటే కడుపు కుడి పైభాగాన సడెన్‌గా, తీవ్రమైన నొప్పికి కారణం అవుతాయి. కొందరికి అత్యవసరంగా సర్జరీ చేయవలసి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని కొవ్వు పదార్థాలు జీర్ణం కావటానికి పైత్యరసం అవసరం. గాల్‌బ్లాడర్‌ లివర్‌ నుంచి విడుదలయ్యే ఈ పైత్యరసాన్ని నిల్వ ఉంచుతుంది. మనం ఆహారం తీసుకోగానే పైత్యరసం నాళం ద్వారా పేగుల్లోకి చేరుకొని, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పైత్యరసంలో కొలెస్ట్రాల్‌, బిలిరుబిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం.. గాల్‌బ్లాడర్‌ పూర్తిగా ఖాళీ కాకపోవటం వంటివి రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంటాయి. ఇవి ఇసుక రేణువులంత సైజు దగ్గర్నుంచి గోల్ఫ్‌ బాల్‌ అంత సైజు వరకూ ఉండొచ్చు. గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ ఉంటే.. నూటికి 75 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండువు. రాయి సైజ్‌ పెద్దగా ఉంటే.. పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిత్తాశయంలో రాళ్లు చిన్నవిగా ఉంటే.. రోజూవారీ ఆహార అలవాట్లతో వాటిని తగ్గించవచ్చు, అవి పెద్దవి కాకుండా నిరోధించవచ్చు. మనం తీసుకునే ఆహారం పిత్తాశయ సమస్యలకు కారణం కాదు కానీ, ఆరోగ్యకరమైన ఆహారం.. రాళ్ల తీవ్రతను తగ్గించడానికి, వాటిని ఏర్పడకుండా నిరోధించడానికి, అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పిత్తాశయ రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తాజా పండ్లు, కూరగాయలు..

మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కూరగాయలు, పండ్లలోని పోషకాలు పిత్తాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పండ్లలో ఫైబర్‌, విటమిన్‌ సి, గ్రూప్‌ బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి గాల్‌బ్లాడర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అన్ని పండ్లు, కూరగాయలలో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ.. మీ ఆహారంలో నిమ్మజాతి పండ్లు (నిమ్మ, కమల, బత్తాయి), క్యాప్సికమ్, దురు ఆకుపచ్చ ఆకుకూరలు, టమాటా ఎక్కువగా తీసుకోండి.

ఫైబర్‌ రిచ్‌ ఫుడ్స్‌..

ఫైబర్‌ రిచ్‌ ఫుడ్స్‌..

ఫైబర్ జీర్ణ వ్యవస్థ రోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగుల ద్వారా ఆహారం కదలికకు సహాయపడుతుంది. ఫైబర్‌ పిత్తరసం ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. ఫైబర్‌ గాల్ బ్లాడర్ స్టోన్స్‌ ముప్పును తగ్గిస్తుంది. ఫైబర్‌ రిచ్‌ ఫుడ్‌.. వేగంగా బరువు కోల్పోయే వ్యక్తులలో పిత్తాశయంలో వ్యర్థాలను తగ్గిస్తుందని ఒక అధ్యయనం స్పష్టం చేసింది. వేగంగా బరువు తగ్గవారికి.. పిత్తాశయ సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మీ డైట్‌లో ఫైబర్‌ అధికంగా ఉండే పండ్లు, గోధుమలు, ఓట్స్, కూరగాయలు, చిక్కుళ్లు, నట్సు, తృణధాన్యాలు తీసుకోండి.

పాలు తాగండి..

పాలు తాగండి..

పిత్తాశయంలో రాళ్లు ఎదుగుదలను నివారించడానికి.. తక్కువ ఫ్యాట్‌ కంటెంట్‌ ఉన్న పాలను తీసుకోవాలి. సాధారణ పాలకు బదులుగా.. ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్, సోయా మిల్క్‌ తీసుకున్నా మంచిదే.

లీన్‌ మీట్‌..

లీన్‌ మీట్‌..

పిత్తాశయ రాళ్ల తీవ్రతను నివారించడానికి లీన్‌ ప్రొటీన్‌ తీసుకోండి. రెడ్‌ మీట్‌, డైరీ ఉత్పత్తులలో ప్రోటీన్‌ ఎక్కువగా ఉన్నా, వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. దీని వల్ల గాల్‌ బ్లాడర్‌ మీద ఒత్తిడ పడుతుంది. వీటికి బదులు లీన్‌ ప్రొటీన్‌ ఉంటే… చికెన్‌, చేపలు తీసుకుంటే మంచిది. కూరగాయలలో ప్రోటీన్‌ పిత్తాశయ సమస్యల ముప్పును తగ్గిస్తాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మీ డైట్‌లో చికెన్‌, చేపలు, నట్స్‌ బీన్స్‌, టోపు, సోయా ఆహార పదార్థాలు తీసుకోండి.

ఈ ఆహారానికి దూరంగా ఉండండి..

ఈ ఆహారానికి దూరంగా ఉండండి..

పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్యాటీ ఫుడ్‌ పిత్తాశయం వాపుకు కారణం అవుతుంది. పిత్తాశయ రాళ్లు ఉన్నవారికే కాకుండా, గాల్‌బ్లాడర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు.. ప్రాసెస్‌ చేసిన ఆహారం, బేకరీ ఫుడ్స్, పాస్తాలు, హై ప్యాట్‌ ఫుడ్స్‌, వెజిటెబుల్‌ ఆయిల్స్‌, చక్కర, మద్యపానానికి దూరంగా ఉండాలి.

​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *