PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గుండె ఆరోగ్యాన్ని కాపాడే జాగ్రత్తలు


ఆరోగ్య సమస్యలతో పాటు గుండె సమస్యల్ని దూరం చేయడంలో లైఫ్‌స్టైల్ విధానం చాలా హెల్ప్ చేస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడే బదులు రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని లక్షణాలు, ఇతర చిట్కాల ద్వారా గుండె ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. అవేంటి.. గుండె ఆరోగ్యం గురించి ఎలా తెలుసుకోవచ్చో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

​గుండె సమస్యలకి కారణాలు..

రోజురోజుకి పెరుగుతున్న గుండె సమస్యలకి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా, పెరుగుతున్న వయసు, పొగత్రాగడం, వర్కౌట్స్ చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటివి ముఖ్యంగా ఉన్నాయి. నిజానికీ గుండె జబ్బులు ప్రాణాలకే ప్రమాదం. నేటి కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ గుండె జబ్బులతోనే మరణిస్తారు. ఇంత ప్రమాదకరమైన సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read : Cough : ఈ ఇంటి చిట్కాలతో దగ్గు త్వరగా తగ్గుతుంది..

​ఈ లక్షణాలు గుర్తించాల్సిందే.

కొన్ని లక్షణాలను గుర్తించి ముందుగా జాగ్రత్త తీసుకుంటేనే సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటంటే…

  • ఛాతీ నొప్పి
  • ఒత్తిడి
  • అసౌకర్యం
  • శ్వాస ఆడకపోవడం
  • తిమ్మిరి
  • చలి,
  • కాలి పాదాలు, వేళ్ళలో నొప్పి
  • మూర్ఛ
  • తలతిరగడం
  • తలనొప్పి
  • గుండె నెమ్మదిగా కొట్టుకోవడం
  • మెడ, గొంతు, దవడ, పొత్తికడుపు, వీపు మీదుగా వచ్చే నొప్పి
  • చర్మ రంగు మారడం
  • పాదాలు, చేతుల్లో వాపు
  • అలసిపోవడం

ఇలాంటి లక్షణాలను గుర్తించిన వెంటనే డాక్టర్‌ని కలవడం చాలా ముఖ్యం. మీకు ఏదైనా సమస్య ఎక్కువగా అనిపిస్తే సన్నిహితుల సాయం తీసుకోవడం మంచిది. అదే విధంగా ఈ కింది ఎక్సర్‌సైజ్‌లతో గుండె ఆరోగ్యాన్ని కనుక్కోవచ్చు. అవి..

​కాలివేళ్ళను పట్టుకునే ఎక్సర్‌సైజ్..

దీనినే టచ్ ద టో ఎక్సర్‌సైజ్ అంటారు. దీనిని కూర్చుని మీ చేతివేళ్ళతో కాళ్ళు పట్టుకుని చేయొచ్చు. ఇది ఇంట్లోనే చేయొచ్చు. దీనికోసం జిమ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎక్విప్‌మెంట్ అవసరం లేదు. ఇది సరిగ్గా చేయగలిగితే గుండె ఆరోగ్యం బాగున్నట్లేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే, ఇది చేసేటప్పుడు ఒకేసారిగా చేయడం కష్టమే. అందుకే మెల్లిమెల్లిగా చేయాలి. ఇది మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

Also Read : Diabetes and Lemon : నిమ్మకాయని ఇలా తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందట..

​మెట్లు ఎక్కడం..

ఇది కూడా సాధారణ పరీక్షల్లో ఒకటి. ఇది చేసే పద్ధతిని బట్టి గుండె ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇటీవల జరిపిన అధ్యయనంలో మెట్లు ఎక్కడం, నడవడానికి పట్టే సమయం గుండె ఆరోగ్యం గురించి చెబుతుందని తేల్చింది.

సాధారణంగా 4 మెట్లు ఎక్కడానికి 1.5 నిమిషాలు పడుతుందని అధ్యయనం చెబుతుంది. తక్కువ సమయంలోనే మెట్లు ఎక్కితే వారి ఎక్సర్‌సైజ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్నట్లేనని అధ్యయనం చెబుతుంది. ఈ ఎక్సర్‌సైజ్‌తో పాటు..

​పల్స్ రేట్..

సాధారణంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పల్స్ రేట్ చెక్ చేస్తుంటారు. హార్ట్ హెల్త్‌ని చెకప్ చేసేందుకు కూడా పల్స్ రేట్ చెక్ చేయడం మంచిది.

  • గుండె కొట్టుకునే వేగం నాలుగు రకాల గుండె లయల ఆధారంగా చెక్ చేస్తారు. అవి..
  • బ్రాడీకార్డియో.. అంటే నిమిషానికి 60 సార్ల కంటే తక్కువగా కొట్టుకోవడం
  • టాచీకార్డియో… అంటే నిమిషానికి 100 సార్ల కంటే ఎక్కువగా కొట్టుకోవడం
  • సాధారణంగా గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది.

ఈ వర్కౌట్స్‌కి శరీరం స్పందించే విధానం గుండె ఆరోగ్యాన్ని తెలుసుకున్నప్పటికీ.. కచ్చితంగా మెడికల్ టెస్టులు కూడా చేయించుకోవాలి.

ఈ వర్కౌట్స్‌ని ఈజీగా చేయగలిగినప్పటికీ మెడికల్ టెస్టులు అనేవి కచ్చితమైన రిజల్ట్స్‌ని చూపిస్తాయి. దీంతో ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *