Feature
oi-Garikapati Rajesh
ఈ
సంవత్సరం
మొత్తం
నాలుగు
గ్రహణాలు
సంభవించబోతుండగా
ఒక
సూర్య
గ్రహణం
అయిపోయింది.
రెండు
చంద్ర
గ్రహాలు,
మరో
సూర్యగ్రహణం
మిగిలివుంది.
ఈ
ఏడాది
మొదటి
చంద్ర
గ్రహణం
మే
5వ
తేదీ
శుక్రవారం
జరగబోతోంది.
బుద్ధ
పూర్ణిమ
కూడా
అదే
రోజు
ఉంది.
తులరాశి,
స్వాతి
నక్షత్రంలో
గ్రహణం
ఏర్పడుతుంది.
దీని
ప్రభావం
రాత్రి
8.44
గంటల
నుంచి
అర్థరాత్రి
01.02
వరకు
ఉంటుంది.
ఆ
సమయంలో
అన్ని
ఆలయాలను
మూసేస్తారు.
ఎవరూ
ఎటువంటి
శుభకార్యాలు
తలపెట్టరు.
చంద్రుడిని
మింగే
ప్రయత్నాలు:పౌర్ణమి
రోజు
రాత్రి
చంద్రుడిని
రాహువు,
కేతువు
మింగడానికి
ప్రయత్నాలు
చేస్తాయి.
గ్రహణానికి
కొన్ని
గంటల
ముందు
సూతక
కాల
సమయం
ఏర్పడుతుంది.
ఈ
క్రమంలో
పలు
రాశులవారిపై
చంద్ర
గ్రహణ
ప్రభావం
ఉంటుందని
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణులు
తెలుపుతున్నారు.
ఏయే
రాశులవారిపై
ఎంత
ప్రభావం
ఉంటుందో
ఇప్పుడు
తెలుసుకుందాం.
రాశులవారిపై
చంద్రగ్రహణ
ప్రభావం
మేషరాశి:చంద్రగ్రహణం
కారణంగా
మేషరాశిపై
ఎక్కువ
ప్రభావం
ఉంటుంది.
వైవాహిక
జీవితంలో
ఇబ్బందులు
ఎదురవుతాయి.
మానసికంగా
తీవ్ర
అనారోగ్య
సమస్య
బారిన
పడే
అవకాశాలున్నాయి.
కాబట్టి
వైవాహిక
జీవితం
గడుపుతున్నవారు
తప్పనిసరిగా
కొన్ని
జాగ్రత్తలు
పాటించాల్సి
ఉంటుంది.
వృషభరాశి:శుక్రుడు
వృషభ
రాశికి
అధిపతి.
దీనివల్ల
చంద్రగ్రహణం
ఈ
రాశివారిపై
తీవ్ర
ప్రభావం
చూపుతుందని
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణులు
తెలియజేస్తున్నారు.
కచ్చితంగా
ఆరోగ్యం
పట్ల
వీరు
ప్రత్యేక
శ్రద్ధ
తీసుకోవాలి.
ఆ
సమయంలో
ఎటువంటి
తొందరపాటు
నిర్ణయాలు
తీసుకోకండి.
చంద్రుడు
బలోపేతమవడానికి:చంద్ర
గ్రహణం
సమయంలో
జాతకంలో
చంద్రుడి
స్థానాన్ని
బలోపేతం
చేయడానికి
తులసి
ఆకులను
నోటిలో
వేసుకుని
చంద్రుని
బీజ
మంత్రం
లేదా
మహా
మృత్యుంజయ
మంత్రాన్ని
జపిస్తుండాలి.
గ్రహణ
సమయంలో
ఈ
మంత్రాలను
జపించడం
వల్ల
ఎంతో
ప్రయోజనం
చేకూరుతుంది.
చంద్ర
గ్రహణం
వేళ
గ్రహణ
ప్రభావం
తొలగి
జాతకంలో
ఉన్న
చంద్రుడు
బలోపేతమవుతాడు.
English summary
A total of four eclipses will occur this year, but one solar eclipse has already occurred
Story first published: Tuesday, May 2, 2023, 16:25 [IST]