PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

జియో సినిమాలో హాలీవుడ్‌ మూవీస్‌, సూపర్‌హిట్‌ సిరీస్‌లు – ఇక మీ ఓపిక


Jio Cinema: ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగా ఇస్తున్న జియో సినిమా (Jio Cinema), త్వరలోనే కొత్త, థ్రిల్లింగ్‌ కంటెంట్‌ జోడించబోతోంది. తద్వారా… ఇంటర్నేషనల్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ ‍‌(netflix), వాల్ట్‌ డిస్నీతో ‍‌(Disney+ Hotstar) పోటీ పడుతోంది.

జియో సినిమా యాప్‌ మరింత కలర్‌ఫుల్‌
రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌18 (Viacom18), వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో మల్టీ-ఇయర్‌ కంటెంట్ కోసం మల్టీ-మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా.. HBO, మ్యాక్స్ ఒరిజినల్ (Max Original), వార్నర్ బ్రదర్స్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు జియో సినిమాను డిఫాల్ట్ హోమ్‌గా మార్చబోతోంది. 100కు పైగా సినిమాలు, లక్షల గంటల టీవీ షోలు, వెబ్‌ షోలు, స్పోర్ట్స్‌ ఈవెంట్లు జియో సినిమా యాప్‌లో కనువిందు చేయనున్నాయి. 

కొత్త కంటెంట్‌ కోసం వార్షిక లైసెన్స్ ఫీజుగా $20 మిలియన్లకు పైగా మొత్తాన్ని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి (Warner Bros Discovery) వయాకామ్18 చెల్లిస్తుందని సమాచారం. డీల్‌ గురించి ఆయా కంపెనీలు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉచితంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల వీక్షణ
2023 నుంచి 2027 వరకు ఐపీఎల్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ సొంతం చేసుకున్న జియో సినిమా… ప్రస్తుతానికి ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా అందిస్తోంది. జియో నెట్‌వర్క్‌ యూజర్లతో పాటు అన్ని టెలికాం నెట్‌వర్క్‌ యూజర్లు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగా చూసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, జియో సినిమా ఫ్లాట్‌ఫామ్‌ వ్యూస్‌ రికార్డ్‌ స్థాయిలో పెరిగాయి. అంతకుముందు, ఫిఫా ప్రపంచకప్‌ 2022 ప్రసారాలు కూడా అందించింది. ఈ రెండు టోర్నమెంట్‌ల దెబ్బకు జియో సినిమా యాప్‌ పాపులారిటీ బాగా పెరిగింది.                 

పాపులారిటీని నిలబెట్టుకునేందుకు మాస్టర్‌ ప్లాన్‌
ఐపీఎల్‌ మ్యాచ్‌లు మే నెల 28వ తేదీతో ముగుస్తాయి. క్రికెట్‌ మ్యాచ్‌లు ఐపోతే ఇక జియో సినిమాను చూసేవాళ్లెవరు?. అందుకే.. ప్రస్తుతం ఉన్న పాపులారిటీని నిలబెట్టుకోవడానికి, ఐపీఎల్‌ మ్యాచ్‌లు ముగిసేలోపే కొత్త కంటెంట్‌ యాడ్‌ చేస్తామని గతంలోనే వయాకామ్‌18 వెల్లడించింది. దీనిలో భాగంగానే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో డీల్ కుదుర్చుకుంది. తద్వారా, వ్యూయర్లను నిలబెట్టుకోవడంతో పాటు మరింత పెంచుకోవాలన్నది టార్గెట్‌. దీంతోపాటు మరికొన్ని అంతర్జాతీయ స్టూడియోలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు.                  

ఇంతకుముందు, వార్నర్‌ బ్రదర్స్‌, హెచ్‌బీవో కంటెంట్‌ కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమైంది. వార్షిక లైసెన్స్ ఫీజుల పెంపుపై విభేదాల కారణంగా, కంటెంట్ ఒప్పందం ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. తాజాగా, వయాకామ్‌18 ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్ల ప్రసారాల కోసం డిస్నీ+ హాట్‌స్టార్ $50 మిలియన్లను చెల్లిస్తే… వయాకామ్‌ దానికి రెట్టింపు మొత్తం చెల్లించబోతోంది.         

కొత్త కంటెంట్‌ కూడా ఫ్రీయేనా?
కొత్త కంటెంట్‌ కోసం సబ్‌స్క్రైబర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని జియో సినిమా భావిస్తోంది. అయితే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు మాత్రం ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని గతంలో ప్రకటించింది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *