PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే.. ఈ ఆహారం కచ్చితంగా తినాలి..!

[ad_1]

Foods Prevent Diabetes: డయాబెటిస్‌ ఒకసారి వస్తే జీవితాంతం.. దీనితో బతకాల్సిందే. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం 2050 నాటికి ముగ్గురిలో ఒకరికి డయాబెటిస్‌ బారిన వచ్చని స్పష్టం చేసింది. డయాబెటిస్‌ను సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిల్లర్‌ అంటారు. దీర్ఘకాలం రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. గుండె సమస్యలు, కిడ్నీ జబ్బులు, కంటి సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే, ఇది వచ్చిన తర్వాత బాధపడటం కంటే, రాకుండా జాగ్రతపడటం మంచిది. షుగర్‌ పేషెంట్స్‌ ముందుగా ‘ప్రీ డయాబెటిక్’ స్టేజ్‌ను దాటే డయాబెటిక్‌గా మారతారు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నిర్దేశించిన విలువ‌ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే డ‌యాబెటిస్ అంటారు. షుగర్‌ లెవల్స్‌ మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా కొంచెం బార్డ‌ర్ లైన్‌లో ఉన్నా, లేదా కొద్దిగా ఎక్కువ‌గా ఉన్నా దాన్ని ప్రీ డ‌యాబెటిస్ అంటారు. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉన్నవారు వారి లైఫ్‌స్టైల్‌, ఆహారం మీద్ద శ్రద్ధ వహించపోతే.. డయాబెటిక్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రీ డ‌యాబెటిస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు.. ఆ తర్వాత స్టేజ్‌ను నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రీ డయాబెటిక్స్‌ ఫుడ్‌ ప్లేట్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ కూరగాయలు తీసుకోండి..

ఈ కూరగాయలు తీసుకోండి..

ప్రీ డ‌యాబెటిక్స్‌.. రోజుకు రెండు రకాల కూరగాయలైనా వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ కూరగాయలలో ఫైబర్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల ఆధారిత ఫైబర్ రక్తంలో చక్కెర పెరగకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. కూలగాయలలో పోషఖకాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారీ.. ఆహారంలో అరకప్పు ఉడికించిన కూరగాయలు లేదా 1 కప్పు వెజిటబుల్ సలాడ్ తీసుకోండి. వీటిలో ఉప్పు వేసుకోకపోవడమే మంచిది.

  • కారెట్
  • క్యాప్సికమ్
  • బ్రోకలీ
  • ఆకుకూరలు
  • కాలే వంటి కూరగాయలు తీసుకోండి.

ఈ కూరగాయలు తక్కువగా తీసుకోండి..

ఈ కూరగాయలు తక్కువగా తీసుకోండి..

మీ ఆహారంలో బంగాళదుంపలు, చిలగడదుంపలు, మొక్కజొన్న, గుమ్మడికాయ వంటి కూరగాయలను.. తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీ డైట్‌లో నాలుగింట ఒక వంతు మాత్రమే తినాలి. వీటిలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

ఈ పండ్లు తినండి..

ఈ పండ్లు తినండి..

పండ్లలో సహజమైన చక్కెరలు ఉంటాయి. పండ్లలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. రోజుకు రెండు నుంచి మూడు సర్వింగ్స్‌ పండ్లు తీసుకోండి. మీ డైట్‌లో బెర్రీ, కివి, పుచ్చకాయ, సిట్రస్‌ పండ్లు, అవకాడో తీసుకోండి. (image source – pixabay)

తృణధాన్యాలు తీసుకోండి..

తృణధాన్యాలు తీసుకోండి..

ప్రీ డ‌యాబెటిక్స్‌ ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోండి. తృణధాన్యాలలో ఫైబర్‌, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. మీ డైట్‌లో ఓట్స్,బ్రౌన్ రైస్, ఓల్‌ వీట్‌, క్వినోవా, రెడ్‌ రైస్‌ తీసుకోండి.

నట్స్‌, విత్తనాలు తీసుకోవచ్చా..?

నట్స్‌, విత్తనాలు తీసుకోవచ్చా..?

నట్స్‌, విత్తనాలలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రీ డయాబెటిక్స్‌ నట్స్‌, విత్తనాలు మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారంలో వాల్‌నట్స్‌, పిస్తా, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, జీడిపప్పు, బాదం తీసుకోండి.

ప్రొటీన్‌ ఆహారం తీసుకోండి..

ప్రొటీన్‌ ఆహారం తీసుకోండి..

మీ ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా చేర్చుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ప్రోటీన్‌లు.. కార్బోహైడ్రేట్లు రక్తప్రవాహంలోకి నెమ్మదిగా వెళ్లేలా సహాయపడతాయి. మీకు డయాబెటిస్‌ రాకుండా ఉండాలంటే.. ప్యాటీ ఫిష్‌, సీఫుడ్, బీన్స్, పప్పులు. మొక్కల ఆధారిత ప్రోటీన్, గుడ్డు, తక్కువ కొవ్వు ఉన్నపాలు, లీన్‌ మాంసాలు తీసుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *