PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

పీరియడ్స్ పోస్ట్‌పోన్‌ చేయడానికి.. మందులు వేసుకోవడం మంచిదేనా..?

[ad_1]

Period Delaying Pills: ప్రతి నెలా ఆడవాళ్లని పీరియడ్స్ పలకరిస్తూనే ఉంటాయి. అయితే, ఏదైనా శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌, ఏదైనా విహార యాత్రలు ప్లాన్‌ చేసుకున్నప్పుడు మాత్రం అడ్డుపడతాయి. చాలామంది మహిళలు, ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో, విహార యాత్రలకు వెళ్లేప్పుడు పీరియడ్స్‌ను పోస్ట్‌పోన్‌ చేయడానికి.. ట్యాబ్లెట్స్‌ వేసుకుంటూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్‌ నెలసరిని తాత్కాలికంగా వాయిదా వేస్తాయి. మీ టూర్‌‌‌ను, ఫంక్షన్‌ పీరియడ్స్‌ తలనొప్పి లేకుండా హ్యాపీగా ఎంజాయ్‌ చేయవచ్చు. అయితే, ఈ ట్యాబ్లెట్స్‌ వేసుకోవడం వల్ల ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయేమో అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. అసలు ఈ ట్యాబ్లెట్స్‌ వేసుకోవడం మంచిదేనా? ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా..? అని ఈ స్టోరీ చూద్దాం.

డాక్టర్‌ ఏమి అంటున్నారు..?

డాక్టర్‌ ఏమి అంటున్నారు..?

మహిళలలో హార్మోన్ల మార్పులు పీరియడ్ టైమ్‌ను నిర్ణయిస్తాయని డాక్టర్‌ ఎన్‌. వరిణి(Dr. Varini N – Senior Consultant – Obstetrician & Gynecologist, Milann Fertility & Birthing Hospital, Kumarapark, Bangalore) అన్నారు. సరళంగా చెప్పాలంటే, ప్రతి నెలా మొదటి రెండు వారాలలో, అండాశయాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా గర్భాశయ లోపలి గోడలని కప్పుతూ ఉండే మృదువైన ఎండోమెట్రియమ్ అనే పొర బాగా ఎదిగి, మందంగా తయారవుతుంది. అధిక రక్త ప్రసరణతో గర్భధారణకు ఈ పొర రెడీగా ఉంటుంది. నెలమధ్యలో విడుదలయ్యే అండం, వీర్యకణంతో కలసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడితే.. ఈ ఎండోమెట్రియమ్ పొర ఆ పిండానికి కావలసిన పోషకాలను, రక్తసరఫరాను అందిస్తూ అది గర్భాశయంలో అతుక్కుని ఎదగడానికి సహాయపడుతుంది. ఒవ్యులేషన్‌ తర్వత రెండు వారాల పాటు ప్రొజెస్టెరాన్‌ ఎండోమెట్రియమ్ పొరను రక్షిస్తుంది. గర్భధారణ జరగకపోతే.. ప్రొజెస్టెరాన్ స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. దీనికారణంగా.. ఈ ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా బ్లీడింగ్‌ రూపంలో బయటకు వస్తుంది. (image source – pexels)

ఈ మాత్రల్లో ఏమి ఉంటుంది..?

ఈ మాత్రల్లో ఏమి ఉంటుంది..?

పీరియడ్స్‌ పోస్ట్‌పోన్‌ చేసే మాత్రలో నోరెథిస్టిరాన్ ఉంటుంది. ఇది ప్రొజెస్టెరాన్ ఆర్టిఫిషియల్‌ రూపం. ఇది శరీరంలో ప్రొజెస్టెరాన్‌ స్థాయిలను కృత్రిమంగా పెంచి.. నెలసరి ఆలస్యం చేస్తుంది. మందమైన గర్భాశయ లైనింగ్ ఎంతకాలం ఉంటుందనే దానిపై పరిమితి ఉన్నప్పటికీ.. పీరియడ్స్‌ను సుమారు రెండు వారాల పాటు వాయిదా వేయడానికి ఈ మందులు సహాయపడతాయి.

మాత్రలు ఎప్పుడు తీసుకోవాలి..?

మాత్రలు ఎప్పుడు తీసుకోవాలి..?

మీ నెలసరి సమయానికి.. మూడు రోజుల ముందు ఈ టాబ్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసుకోవాలని డాక్టర్‌ ఎన్‌. వరిణి అన్నారు. మీరు ఆలస్యం కావాలనుకునేంత వరకు ప్రతిరోజూ డాక్టర్‌ సూచించిన మేరకు ఈ మందులు తీసుకోవడం కొనసాగించాలి. మీరూ ఈ ట్యాబ్లెట్స్‌ ఆపిన తర్వతా.. వారంలో మీ పీరియడ్‌ వస్తుంది. (image source – pexels)

మందులు వాడటం మంచిదేనా..?

మందులు వాడటం మంచిదేనా..?

పీరియడ్స్‌ పోస్ట్‌పోన్‌ చేసే మందులు తీసుకోవడం పూర్తిగా సురక్షితం కాకపోవచ్చని, మాత్రలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం అవసరం అని డాక్టర్‌ ఎన్‌. వరిణి అన్నారు. మీ ట్రిప్‌, ఫంషన్స్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేయడానికి, పీరియడ్స్‌ ఇబ్బంది నుంచి తప్పించుకోవడడానికి ఈ మాత్రలు సహాయపడతాయి. అయితే, ఈ మందులు పదే పదే వేసుకోవడం వల్ల. శరీరంలోని హార్మోన్లపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా, నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంది. ఈ మందులు వాడితే మూడ్ స్వింగ్స్, పొత్తికడుపు అసౌకర్యం, వికారం, బ్లీడింగ్‌ సరిగ్గా కాకపోవడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎదురవుతాయి.

వీరు జాగ్రత్తగా వాడాలి..

వీరు జాగ్రత్తగా వాడాలి..

బ్లీడింగ్‌ సరిగ్గా అవ్వనివారు, అధిక రక్తస్రావం, రొమ్ము గడ్డలు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్ కుటుంబ చరిత్ర, కాళ్లు, ఊపిరితిత్తులు, మెదడులో రక్తం గడ్డకట్టిన వారు, యాంటీ కన్వల్సెంట్ ఉన్న మహిళలు ఈ మందులును జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, పీరియడ్స్‌ పోస్ట్‌పోన్‌ మందులు వాడే ముందు ప్రతి మహిళ డాక్టర్‌ను సంప్రదించడం మేలు. మీ పరిస్థితిని వారితో చర్చించాలి. డాక్టర్‌ను సంప్రదించకుండా పీరియడ్స్‌ వాయిదా వేయడం సురక్షితం కాదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *