PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఫ్లాట్‌గా సెన్సెక్స్‌, నిఫ్టీ – జీడీపీ గణాంకాలు కిక్కిస్తే బుల్‌ రన్నే!


Stock Market Opening 28 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మధ్యాహ్నం జీడీపీ గణాంకాలు విడుదల అవుతుండటంతో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్లు పెరిగి 17,411 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 69 పాయింట్ల పెరిగి 59,370 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 59,288 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,346 వద్ద మొదలైంది. 59,227 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,483 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 69 పాయింట్ల లాభంతో 59,370 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 17,392 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,383 వద్ద ఓపెనైంది. 17,367 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,440 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 18 పాయింట్లు పెరిగి 17,411 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 40,302 వద్ద మొదలైంది. 40,205 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,391 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 56 పాయింట్లు పెరిగి 40,363 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.56,120గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.840 పెరిగి రూ.25,010 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.





Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *