PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

బడ్జెట్‌ తర్వాత భారీగా పెరిగే సత్తా ఉన్న 10 స్టాక్స్‌ ఇవి, ముందే కొనమంటున్న ఎక్స్‌పర్ట్స్‌

[ad_1]

Budget 2023: 2023 ఫిబ్రవరి 1న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ ప్రకటిస్తారు. ఈ బడ్జెట్‌ ప్రసంగానికి ముందు, PSUలతో పాటు మౌలిక సదుపాయాలు, తయారీ, క్యాపిటల్‌ గూడ్స్‌, రక్షణ, రైల్వేలకు సంబంధించిన స్టాక్స్‌ దలాల్ స్ట్రీట్‌లో సందడి చేస్తున్నాయి.

ఈ నెలలో ఇప్పటివరకు హెడ్‌లైన్ ఇండెక్స్ BSE ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, బీఎస్‌ఈ క్యాపిటల్ గూడ్స్, బీఎస్‌ఈ మెటల్, నిఫ్టీ పీఎస్‌ఈ సూచీలు టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి.

మోర్గాన్ స్టాన్లీ లెక్క ప్రకారం.. ఆర్థిక సంవత్సరాన్ని ఏకీకృతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ మెరుగైన పనితీరును కనబరుస్తాయి. ఒక ఖర్చునే కేంద్ర ప్రభుత్వం ఇష్టపడితే, కన్జ్యూమ్‌ డిస్క్రిషనరీ, ఇండస్ట్రియల్‌ స్టాక్స్‌ మెరుగ్గా ఉంటాయి. ఈ మూడు రంగాల మీద మోర్గాన్ స్టాన్లీ ‘ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌’తో ఉంది.

మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ బడ్జెట్‌లో కేంద్రం మరిన్ని నిధుల కేటాయిస్తుందని.. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాల వృద్ధికి ఇది సహాయపడుతుందన్న అధిక అంచనాలు ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ తెలిపింది.

news reels

ఈ నేపథ్యంలో, బడ్జెట్‌ ముందు కొనదగినవంటూ టాప్‌ బ్రోకరేజ్‌/ ఎక్స్‌పర్ట్స్‌ సూచించిన 10 స్టాక్స్‌ ఇవి:

1) మహీంద్ర & మహీంద్ర (M&M)
తగ్గుతున్న కమొడిటీ ధరలు, కొత్త లాంచ్‌లు, సామర్థ్య విస్తరణ, EV సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టడం, ప్రొడక్ట్‌ ప్రీమియమైజేషన్‌ వంటివి ఈ కంపెనీకి సానుకూలాంశాలు.
బ్రోకరేజ్‌: రెలిగేర్‌ బ్రోకింగ్‌

2) డాబర్‌ ఇండియా (Dabur India)
టార్గెట్‌ ధర: రూ. 675
ఎక్స్‌పర్ట్‌: సంజీవ్ హోటా, రీసెర్చ్ హెడ్, BNP పారిబాస్

3) ఫినోలెక్స్‌ కేబుల్స్‌ (Finolex Cables)
టార్గెట్‌ ధర: రూ. 660
ఎక్స్‌పర్ట్‌: సంజీవ్ హోటా, రీసెర్చ్ హెడ్, BNP పారిబాస్

4) ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ (IRCON International)
టార్గెట్‌ ధర: రూ. 71 
ఎక్స్‌పర్ట్‌: స్వప్నిల్ షా, రీసెర్చ్ డైరెక్టర్, స్టోక్స్‌బాక్స్

5) ఐటీసీ (ITC)
సిగరెట్ల మీద కొత్త పన్ను విధించకుండా, పాత పన్నులనే కొనసాగించే అవకాశం ఉంది. ఇది, మార్జిన్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. 
బ్రోకరేజ్‌: LKP సెక్యూరిటీస్‌

6) హెచ్‌ఏఎల్‌ (HAL)
టార్గెట్‌ ధర: రూ. 2,977
ఎక్స్‌పర్ట్‌: సంజీవ్ హోటా, రీసెర్చ్ హెడ్, BNP పారిబాస్

7) పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌ (PSP Projects)
మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కొత్త కళ, అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ఈ స్టాక్‌ సద్వినియోగం చేసుకునే పొజిషన్‌లో ఉంది.
ఎక్స్‌పర్ట్‌: స్వప్నిల్ షా, రీసెర్చ్ డైరెక్టర్, స్టోక్స్‌బాక్స్

8) పీఎన్‌సీ ఇన్ఫోటెక్‌ (PNC Infratech)
జల్‌ జీవన్‌ మిషన్‌కు FY2023లో రూ. 49,758 కోట్ల కేటాయింపులు చేశారు. ఈసారి కూడా ఇదే మొత్తం లేదా ఇంతకంటే ఎక్కువ ఎక్కువ కేటాయింపులు ఉండవచ్చు. ఇది స్టాక్‌కు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.
ఎక్స్‌పర్ట్‌: సంజీవ్ హోటా, రీసెర్చ్ హెడ్, BNP పారిబాస్

9) అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (UltraTech Cement)
సిమెంట్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌, మెరుగైన రియలైజేషన్లు, ఇప్పటికే ఉన్న ఫ్లాంట్ల నుంచి పెరిగిన వినియోగం కలిసి వాల్యూమ్ వృద్ధికి సహాయపడతాయి.
బ్రోకరేజ్‌: రెలిగేర్‌ బ్రోకింగ్‌

10) మాక్రోటెక్‌ (‍Macrotech)
టార్గెట్‌ ధర: రూ. 1,378.
ఎక్స్‌పర్ట్‌: సంజీవ్ హోటా, రీసెర్చ్ హెడ్, BNP పారిబాస్

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *