[ad_1]
Bank Holidays for 3 Consecutive Days: పండుగలు, వివిధ సందర్భాల కారణంగా నవంబర్ నెలలో బ్యాంకులకు చాలా రోజులు సెలవులు (Bank Holidays in November 2023) వచ్చాయి. నెలాఖరుకు చేరుకున్నా ఈ సెలవుల్లో ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి బ్యాంక్‌లకు లాంగ్ వీకెండ్ రాబోతోంది.
బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. ఈ నెల 25న నాలుగో శనివారం, 26న ఆదివారం నాడు సాధారణ సెలవులు ఉన్నాయి. సోమవారం (27 నవంబర్ 2023) రోజు కూడా బ్యాంక్‌లు పని చేయవు.
సోమవారం రోజున గురునానక్ జయంతి (Guru Nanak Jayanti 2023), కార్తీక పౌర్ణమి (Kartik Purnima 2023) ఉన్నాయి. కాబట్టి, 27వ తేదీన చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు తాళం వేసి కనిపిస్తుంది. బ్యాంక్‌లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే శుక్రవారమే పూర్తి చేసుకోండి. లేదా, సోమవారం తర్వాత ప్లాన్ చేసుకోండి.
ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులకు సోమవారం సెలవు?
కార్తీక పౌర్ణమిని, సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్ పుట్టిన రోజుగా జరుపుకుంటారు. సిక్కు మతం ప్రభావం లేని రాష్ట్రాల్లో కార్తీక పూర్ణిమ కారణంగా సెలవు ఇచ్చారు. గత నెల (అక్టోబర్) 27న రిజర్వ్ బ్యాంక్ (RBI) రిలీజ్ చేసిన ‘నవంబర్ నెల సెలవుల జాబితా’ (Bank Holidays list in November 2023) ప్రకారం… అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, దెహ్రాదూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొహిమా, లఖ్‌నవూ, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచి, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్యాంకులు బంద్
నవంబర్ 30, 2023న (గురువారం) కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంక్‌లకు హాలిడే ఇచ్చారు. అదే రోజున తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election Schedule 2023) జరుగుతాయి. కాబట్టి, ఆ రాష్ట్రంలోనూ బ్యాంకులు పని చేయవు.
2023 డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవు రోజులు (Bank Holidays in December 2023):
డిసెంబర్ 1, 2023 – రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 3, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 4, 2023 – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ కారణంగా గోవాలో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 9, 2023 – రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 10, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 12, 2023 – ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా కారణంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేస్తారు
డిసెంబర్ 13 & 14, 2023 – లోసంగ్/నామ్‌సంగ్ కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 17, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 18, 2023 – యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 19, 2023 – విమోచన దినోత్సవం కారణంగా గోవాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 23, 2023 – నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 24, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 25, 2023 – క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 26, 2023 – క్రిస్మస్ వేడుకల కారణంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 27, 2023 – క్రిస్మస్ వేడుకల కారణంగా నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 30, 2023 – యు కియాంగ్ నంగ్‌బా దృష్ట్యా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 31, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఇది కాకుండా, డిసెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది సమ్మెకు (Bank Employees On Nationwide Strike) దిగుతున్నారు. ఆయా రోజుల్లోనూ బ్యాంక్ సేవలు అందవు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
మరో ఆసక్తికర కథనం: ఆధార్ ఫ్రీ అప్‌డేషన్ గడువు దగ్గర పడుతోంది – మీ వివరాలన్నీ ఉచితంగా మార్చుకోవచ్చు!
[ad_2]
Source link
Leave a Reply