PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు; గోల్డ్ లవర్స్ లో జోష్; కొనుగోలుపై నిపుణుల సలహా ఇదే!!


తగ్గుతున్న బంగారం ధరలు

జాతీయంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో, దేశీయంగాను బంగారం ధరల తగ్గుదల ప్రధానంగా కనిపిస్తుంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు ప్రస్తుతం 1843.60 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, స్పాట్ సిల్వర్ రేటు 21.81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా గోల్డ్ ధరల తగ్గుదల ప్రభావం దేశీయంగానూ కనిపిస్తుంది. ఇక దేశంలో నేడు బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే వంద రూపాయల మేర తగ్గినట్టు తెలుస్తుంది.

 హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 52,000 వద్ద కొనసాగుతుంది. ఈ ధర నిన్న 52,100గా ఉంది. ప్రస్తుతం వంద రూపాయలు మేర 22 క్యారెట్ల బంగారం మీద ధర తగ్గినట్టు తెలుస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు హైదరాబాదులో 56,730 రూపాయలుగా కొనసాగుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే 100 రూపాయల మేర 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.

 ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు నేడు

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు నేడు

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 52,150 రూపాయలుగా కొనసాగుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,880 గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి నేడు 52,000గా కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

 ఏపీలో బంగారం ధరలు ఇలా.. చెన్నైలోనే అత్యధికంగా బంగారం ధరలు

ఏపీలో బంగారం ధరలు ఇలా.. చెన్నైలోనే అత్యధికంగా బంగారం ధరలు

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000గా కొనసాగుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. విజయవాడలోని ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఒక దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలో బంగారం ధరల విషయానికి వస్తే చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 52,700గా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 57,500గా విక్రయించబడుతుంది.

బంగారం కొనటానికి ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు

బంగారం కొనటానికి ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు

అయితే స్థానికంగా ఉండే పన్నులను బట్టి బంగారం ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అంశం. రానున్న రోజుల్లో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని, కొనుగోలుదారులకు ఇది మంచి సమయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం అని సూచిస్తున్నారు. కొద్దిరోజుల కిందట రికార్డులు బ్రేక్ చేసి పెరిగిన బంగారం ధర ఇప్పుడిప్పుడే మళ్ళీ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *