PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

[ad_1]

Stock Market Opening 05 June 2023: 

స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల  నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎకానమీ దూసుకెళ్తుండటంతో సూచీలు బుల్‌రన్‌ కొనసాగిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 80 పాయింట్లు పెరిగి 18,614 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 307 పాయింట్లు ఎగిసి 62,854 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, రియాల్టీ రంగాల షేర్లు జోరుమీదున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,547 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,759 వద్ద మొదలైంది. 62,759 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,915 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 307 పాయింట్ల లాభంతో 62,854 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 18,534 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,612 వద్ద ఓపెనైంది. 18,582 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 80 పాయింట్లు పెరిగి 18,614 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,103 వద్ద మొదలైంది. 44,101 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,245 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 229 పాయింట్లు ఎగిసి 44,167 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, మారుతీ, సన్‌ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, టెక్ మహీంద్రా, బీపీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర  రూ.60,330గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.26,670 వద్ద ఉంది.

Also Read: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *