మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉందా?, ఈ సీక్రెట్‌ బెనిఫిట్‌ పూర్తిగా ఉచితం

[ad_1]

ATM Card Insurance: ఈ కాలంలో దాదాపు అందరి దగ్గర ఏటీఎం కార్డులు (డెబిట్‌ కార్డ్‌లు) ఉన్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడానికి, ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన, రూపే కార్డ్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీటి వల్ల ATM కార్డులు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారాయి. నగదు రూప లావాదేవీలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, డబ్బును సురక్షితంగా, లావాదేవీలను సులభతరం చేసాయి ఈ కార్డులు. ఇవే కాదు, ప్రజలకు తెలియని మరికొన్ని ప్రయోజనాలు కూడా వీటి వల్ల ఉన్నాయి.

ATM కార్డ్ అతి ముఖ్యమైన లక్షణాల్లో ఉచిత బీమా ఒకటి. ఒక బ్యాంకు తన ఖాతాదారుడికి ఏటీఎం కార్డు జారీ చేసిన క్షణం నుంచి ఆ ఖాతాదారు ప్రమాద బీమా, జీవిత బీమా పరిధిలోకి వస్తాడు. అయితే దీనికి సంబంధించిన సమాచారం అందరికీ తెలియకపోవడంతో కొద్ది మంది మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈ విషయంపై విస్తృత అవగాహన కల్పించకపోవడం బ్యాంకుల తప్పయితే, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం ప్రజల తప్పు.

ATM కార్డ్ హోల్డర్ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైతే, ఆ కార్డ్‌ అతని కుటుంబానికి లేదా వైద్య ఖర్చులకు అండగా నిలబడుతుంది. ప్రమాదంలో ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోతే… అతనికి రూ. 50,000 ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోయినట్లయితే, ఒక లక్ష రూపాయల బీమా మొత్తం లభిస్తుంది. కార్డ్‌దారు మరణిస్తే, ఒక లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కవరేజీ అతని కుటుంబానికి లభిస్తుంది.

కార్డ్‌ రకాన్ని బట్టి రూ. 5 లక్షల వరకు కవరేజీ
ప్రమాద సమయంలో, ATM కార్డ్‌ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే చిన్న నిబంధన ఉంది. ప్రమాదానికి గురైన కార్డుదారు, ఆ ప్రమాదానికి కనీసం 45 రోజుల ముందయినా ఆ ATM కార్డ్‌ను ఉపయోగించి ఉండాలి. అప్పుడే క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలవుతుంది. 

బ్యాంకులు, తమ ఖాతాదార్లకు అనేక రకాల ATM కార్డులను జారీ చేస్తాయి. ATM కార్డ్ కేటగిరీని బట్టి దాని వల్ల లభించే బీమా మొత్తం మారుతుంది. కస్టమర్లకు, ATM క్లాసిక్ కార్డ్‌పై రూ. 1 లక్ష, ప్లాటినం కార్డ్‌పై రూ. 2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డ్‌పై రూ. 50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డ్‌పై రూ. 5 లక్షలు, వీసా కార్డ్‌పై రూ. 1.5-2 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన కింద ఖాతాదార్లకు అందిన రూపే కార్డుపై రూ. 1 నుంచి 2 లక్షల వరకు బీమా ఉంటుంది.

క్లెయిమ్ చేసే ప్రక్రియ ఇది
ATM కార్డ్‌ మీద ప్రమాద బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి, సంబంధిత బ్యాంకుకు కార్డుదారు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్‌లో FIR కాపీ, హాస్పిటల్ ట్రీట్‌మెంట్ సర్టిఫికేట్ మొదలైన పత్రాలను సమర్పించాలి. ఒకవేళ కార్డుదారు మరణిస్తే, అతని నామినీ సంబంధిత బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డుదారు మరణ ధృవీకరణ పత్రం, FIR కాపీ, డిపెండెంట్ సర్టిఫికేట్ వంటి పత్రాలు ఇందుకు అవసరం. సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదిస్తే, దీని గురించిన మరింత వివరంగా సమాచారాన్ని సేకరించవచ్చు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *