PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మీ నడక స్టైల్‌ మారిందా..? ఫ్యాటీ లివర్‌కు సంకేతం కావచ్చు..!


​Fatty Liver: లివర్‌ మన శరీరంలో ముఖ్యమైన అవయవం. లివర్‌ మన శరీరంలో నుంచి విషపదార్థాలను తొలగిస్తుంది. కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్‌లను జీవక్రియ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. గ్లైకోజెన్, విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేస్తుంది. లివర్‌ అల్బుమిన్, ప్లాస్మా ప్రొటీన్‌‌లను సంశ్లేషణ చేస్తుంది. రోగనిరోధక శక్తి, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో కాలేయం చాలా అవసరం. లివర్‌ మన శరీరంలో దాదాపు 500 రకాల పనులను చేస్తుంది. మనం లివర్‌ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
అ యితే, ప్రస్తుతం ఫ్యాటీ లివర్‌ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. మనదేశంలో 9% నుంచి 32% మంది ప్యాటీ లివర్‌తో ఇబ్బంది పడుతున్నారు. లివర్‌లో అదనపు కొవ్వు పేరుకుపోవడాన్ని.. హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. ఫ్యాటీ లివర్‌ సమస్య రెండు రకాలు ఉంటుంది. 1. ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌, 2. నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌. ఆల్కహాల్‌ ఎక్కువగా తాగేవారికి ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్‌ తక్కువగా, అసలు తాగని వారిలో ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తే.. దాన్ని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు. కొన్నిరకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ లోపం, అధిక బరువు, డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారికి.. నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. రెండు రకాల ఫ్యాటీ లివర్‌ సమస్యలు ప్రాణాంతకమని నిపుణులు అంటున్నారు.

ఈ లక్షణాలు ఉంటాయి..

ఫ్యాటీ లివర్‌ కారణంగా.. పొత్తికడుపు నొప్పి, కడుపు నిండుగా ఉండటం, వికారం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గడం, చర్మం పసుపు రంగులోకి మారడం, కళ్లు తెల్లగా మారడం, పొత్తికడుపు, కాళ్లు ఉబ్బటం, అలసట, మానసిక గందరగోళం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నడక మారుతుంది..

నడక మారుతుంది..

రెండు రకాల ఫ్యాటీ లివర్ డిసీజ్‌లలో, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ న్యూరోలాజికల్ వ్యాధులకు.. వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్‌లలో ఒకటి అని , Express.co.uk తెలిపింది. లివర్‌ సమస్యల కారణంగా.. శరీరంలోని అనేక విధులను ఎఫెక్ట్‌ అవుతాయి. ఫ్యాటీ లివర్‌ సమస్య కారణంగా మానసిక స్థితి, మాట్లాడే విధానం, నిద్ర, వ్యక్తి కదలకలలోనూ మార్పులకు దారితీస్తుంది. వాకింగ్‌ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు కనిపిస్తే.. ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాధిని సూచిస్తాయని Express.co.uk పేర్కొంది.

ఈ మార్పులు ఉంటాయి..

ఈ మార్పులు ఉంటాయి..

లివర్‌ ట్రస్ట్ ప్రకారం, ఫ్యాటీ లివర్‌ కారణంగా వ్యక్తి నడకలో అత్యంత సాధారణంగా రెండు మార్పులు కనిపిస్తాయి. నడక అస్థిరంగా ఉంటుంది, తూలుతూ ఉంటారు. నడకలో సమన్వయం ఉండదు. లాస్ట్‌ స్టేజ్‌ ఫ్యాటీ లివర్‌ సమస్యలు, పార్కిన్సన్స్‌ మధ్య సారూప్యతను అధ్యయనాలు స్పష్టం చేశాయి. న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ప్రకారం, “పార్కిన్సన్స్ వ్యాధిలా కాకుండా.. ప్యాటీ లివర్‌లో నడగ, భంగిమలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఈ జాగ్రత్తలు తీసుకోండి..
  • ఫ్యాటీ లివర్‌ ముప్పును తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్యకు దూరంగా ఉండటానికి మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. సంతృప్త కొవ్వులకు బదులు అసంతృప్త కొవ్వులతో కూడిన చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తీసుకోవాలి.
  • కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో ఫెర్టిలైజర్స్‌ ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
  • చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, స్పోర్ట్స్‌ డ్రింక్స్‌‌, వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • స్మోకింగ్‌, ఆల్కహాల్‌ మానేయాలి.
  • రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *