PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మెడనొప్పి తగ్గాలంటే ఇలా చేయండి..

[ad_1]

సాధారణంగా, తల బరువు మొత్తం మెడపైనే ఉంటుంది. నొప్పి వస్తేనే తెలుస్తుంది మెడ పరిస్థితి గురించి. ఈ మధ్యకాలంలో చాలా వరకూ అందరూ మెడనొప్పి అంటూ బాధపడుతున్నారు. నగలు బదులు మెడపట్టీలు వేసుకుని తరుగుతున్నారు. దీంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

​మెడ నొప్పి వచ్చినప్పుడు..

నొప్పి వస్తే ఏదో ఓ పెయిన్ బామ్ రాయడం, పెయిన్ కిల్లర్ వేయడం, సమస్య అప్పటికీ తగ్గకపోతే సర్జరీ వరకూ వెళ్ళడం.. ఇలాంటి సమస్యలు ముందు నుంచి ముదరకుండానే జాగ్రత్తపడితే మెడ నొప్పి నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వొచ్చు. మెడను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. అందుకే ముందుగా మెడ దగ్గర ఉండే వెన్నుపూస గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో ఇప్పుడు స్పైనల్ కార్డ్ గురించి తెలుసుకుందాం.

Also Read : Thyroid : మగవారికి థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా..

​స్పైనల్ కార్డ్..

మెడ దగ్గర ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అని అని, రెండో వెన్నుపూసను ఆక్సిస్ అని అంటారు. ఆ తర్వాత పూసలను వరుసగా సర్వైకల్ 3, 4, 5, 6, 7 అంటారు. ఇవన్నీ కూడా జాయింట్స్‌గా ఉంటాయి. వీటిలోనే స్పైనల్ కెనాల్ ఉంటుంది. దీని ద్వారా స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము మెదడు నుండి కాళ్ళు, చేతులకు నరాలను తీసుకెళ్తుంది. ఓ వెన్నుపూసకు, మరో వెన్నుపూసకు ఉండే ఇంటర్ వర్టిబ్రల్ పారామినా నుండి ఒక్కో నరం బయటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కోవైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. డిస్క్‌కి రక్తం అవసరం లేదు. మనం తీసుకున్న ఫుడ్‌తోనే పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువుని బ్యాలెన్స్ చేసేందుకు ఇది హెల్ప్ అవుతుంది.

మనం సరిగ్గా కూర్చోకపోవడం, నిల్చోకపోవడం వల్లే మెడనొప్పి ఎక్కువగా వస్తుంది. డిస్క్ వల్ల కూడా ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడే ఈ నొప్పి ఉంటుంది. వెన్నుపూసలో నుండి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ చిన్న మెదడుకి రక్తాన్ని అందిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్ రక్త ప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకి రక్తప్రసారం అంతగా అందదు. ఫలితంగా నొప్పితో పాటు తల తిరగడం, మైకం, వాంతులు కూడా అవుతుంటాయి.

​కారణాలు..

మన శరీరంలో ఎక్కువ కదలికలు ఉండేది వెన్నెముక. ఇక ఒత్తిడికి లోనయ్యేది మెడ. తలబరువుని మోస్తుంది. కాబట్టి, ఇంకా ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. లైఫ్‌స్టైల్ వచ్చే ఇబ్బందుల వల్ల మెడ కండరాలు ఒత్తిడికి లోనై నొప్పి వస్తుంది. వీటితో పాటు వయసు పెరగడం, డిస్క్ అరిగిపోవడం వల్ల కూడా నొప్పి రావొచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల నొప్పి వస్తుంది.

  • నొప్పి తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.
  • ఒకట్రెండు రోజుల్లో తగ్గకపోతే వెంటనే డాక్టర్స్‌ని సంప్రదించాలి.
  • మరీ అవసరం అయితే తప్పా పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. ఇవి కూడా డాక్టర్ చెబితేనే తీసుకోవాలి.
  • పెద్ద పెద్ద బరువులు మోయొద్దు

మెడనొప్పి వచ్చినప్పుడు దాని వల్ల శరీరంలో మరెక్కడా నొప్పి రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. అది చేతులు, భుజాల, వీపు వరకూ వస్తేనే ముందుగా డాక్టర్స్‌ని కలవాలి. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ వెన్నుపూస జాయింట్లలో కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మెడలోనొప్పి వచ్చినప్పుడు మెడని కదపలేం. 90 శాతం నొప్పులు మనం తీసుకునే జాగ్రత్తల వల్లే నయం అవుతాయి.

జాగ్రత్తలు తీసుకుని మందులు వాడినా తగ్గకపోతే అవి సర్జరీ దాకా వెళ్తాయి. మన జీవన విధానం బాగుండేలా చూసి డాక్టర్స్ చెప్పిన సలహాలు కచ్చితంగా తీసుకోవాలి.

పెయిన్ కిల్లర్స్‌తో ప్రాబ్లమ్..

పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు అప్పటికప్పుడు కాస్తా రిలీఫ్ దొరికినా అది శాశ్వత పరిష్కారం అనుకోవద్దు. నొప్పిని తగ్గించే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

​డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?

  • జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ సూచించిన మందులు వేసుకున్నా మెడనొప్పి వచ్చి వారం రోజులు దాటినా తగ్గకపోతే
  • అకస్మాత్తుగా కిందపడడం, దెబ్బ తగిలినప్పుడు మెడలో నొప్పి ఉండడం
  • నొప్పి మెడలో మొదలై ఇతర అవయవాలకు పాకుతున్నా
  • మెడనొప్పితో పాటు చేతులు, కాళ్ళలో తిమ్మరి ఉండి స్పర్శ లేకపోతే డాక్టర్‌ని కలవాలి.
  • మెడలో ఇబ్బందిగా ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవాల్సిందే..

ఆలస్యం చేస్తే మెడనొప్పి పెరిగి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కడైనా నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్రవిసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

Also Read : Migraine : ఈ ఆసనాలతో మైగ్రేన్ తలనొప్పి ఇట్టే తగ్గుతుందట..

​టెస్ట్‌లు..

ఎక్స్‌రే స్కానింగ్..

మెడనొప్పితో వచ్చే వారికి ఎక్స్‌రే ద్వారా సమస్య తీవ్రతను కనుక్కోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైనా తేడాలు ఉన్నాయా? అనేది తెలుసుకుని దానిని బట్టి ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది. దానిని బట్టే పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా.. మధ్యలో ఏమైనా వచ్చాయా.. వీటన్నింటిని గమనించాలి.

Also Read : Mattress : కొత్త పరుపులు కొంటున్నారా.. వీటిని మరువొద్దు..

​తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • మెడనొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడినా రిలీఫ్ కోసం కాసేపు చల్లగా, కాపడం వంటివి చేయొచ్చు. వేడినీటిలో క్లాత్ వేసి పిండి మెడపై కాపాలి. లేదంట్ ఐస్ ముక్కని క్లాత్‌ చుట్టి దాంతో కాపడం పెడితే సాధారణ నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.
  • మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే, కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందుకే నొప్పి ఉన్నప్పుడు పనులు చేయకుండా కాసేపు రెస్ట్ తీసుకోవాలి.
  • ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి మెడనొప్పి తగ్గించుకునేందుకు కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చు.
  • సాధారణ నొప్పి అయితే, పెయిన్ కిల్లర్ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకి అయిదు, ఆరు సార్లు సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

-DR.Syed Ameer Basha, Sr.Consultant Neuro Surgeon, CARE Hospitals

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu News

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *