PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

యోగాతో కేవలం 30 రోజుల్లోనే.. ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందండి..!


Yoga Benefits in 30 Days: యోగా.. 5000 సంవత్సరాల క్రితం మన దేశానికి దొరికిన బహుమతి లాంటిది. యోగా శాస్త్రబద్ధమై జీవన విధానం. భారతీయ సంస్కృతిలో, ఆధ్యాత్మిక చింతనలో యోగాకు ప్రత్యేక స్థానముంది. శరీర భాగాల వ్యాయామాల్ని, శ్వాస తీసుకునే పద్ధతుల్ని ఇందులో గమనించాలి. యోగా మనసు, శరీరాన్ని.. అంతర్గత భావాల్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మనం ఆరోగ్యంగా ఉంటాం. మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసమూ అలవడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యోగా నిపుణుడు, జోగా వెల్నెస్ CEO, సహ వ్యవస్థాపకుడు నిమిష్ దయాలు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను చూడటానికి, మనం క్రమం తప్పకుండా 30 రోజుల పాటు సాధన చేయాలని అన్నారు. దీని కోసం జీవనశైలిలో క్రమశిక్షణ, సంకల్పం తీసుకురావడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ’30 రోజుల యోగా ఛాలెంజ్’ తీసుకోవడం ద్వారా షాకింగ్ ఫలితాలను పొందవచ్చని అన్నారు. 30 రోజులు క్రమం తప్పకుండా.. యోగా చేయడం వల్ల కలిగే లాభాలను నిమిష్‌ దయాలు మనకు వివరించారు.

ఒత్తిడి దూరం అవుతుంది..

ఒత్తిడి మనకు అతిపెద్ద శత్రువని.. నిమిష్‌ దయాలు అన్నారు. యోగా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే.. శరీరంలో ఎండార్ఫిన్‌ స్థాయి పెరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి, మెటబాలిజం, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా చేసే యోగా భావోద్వేగాలను నియంత్రించుకునేలా చేస్తుంది. కోపం, ఆందోళన, ఒత్తిడి, చికాకు, గందరగోళాన్ని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

ఫ్రెక్సిబిలిటీ పెరుగుతుంది..

యోగాసనాల క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరం ఫ్రెక్సిబుల్‌ అవుతుంది. మీరు బాడీ ఫ్లెక్సిబుల్‌ అవ్వాలనుకుంట.. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం చాలా ముఖ్యం. మీ కండరాల కదలిక కోసం, శరీర కదలిక ముఖ్యం. ఈ యోగాభ్యాసంలో కొంత సమయం వెచ్చిస్తే.. మీ శరీరంలోని మార్పులు, సామర్థ్యాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు.

ఇమ్యూనిటీ పెరుగుతుంది..

యోగాభ్యాసం మీ శారీరక సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా మీ దృఢనిశ్చయాన్ని కూడా పరీక్షిస్తుంది. ఫలితంగా, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ మీ శరీరాన్ని సడలిస్తుంది, ప్రశాంతపరుస్తుంది. యోగా వల్ల.. వ్యాధినిరోధక శక్తి ఉత్తేజితమై ఉంటుంది. దగ్గులు, జలుబులు, జ్వరాలు, తలనొప్పులు ఇలా మనల్ని తరుచుగా వేధించే జబ్బులు అంత తేలిగ్గా మన దరికి చేరవు. నాడీ వ్యవస్థ కూడా చురుగ్గా పని చేస్తుంది.

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది..

కేవలం కొన్ని రోజుల యోగాభ్యాసంతో, మీ మనస్సు మునుపటి కంటే చాలా ప్రశాంతంగా, పరధ్యానం లేకుండా ఉంటుంది. మీరు మీ శరీర శక్తిని సరైన దిశలో ఉపయోగించగలరు. ఒక లక్ష్యంపై దృష్టి పెట్టగల సామర్థ్యం యోగా ద్వారా మాత్రమే సాధించగలం.

క్రమశిక్షణ అలవడుతుంది..

యోగా వల్ల కేవలం శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా.. మనలో క్రమశిక్షణ కూడా అలవడుతుంది. సూర్యోదయానికి ముందే మేల్కోవడం, యోగా చేయడం దినచర్యలో భాగమై పోతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *