PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రాకెట్లా దూసుకెళ్తున్న ఐటీ షేర్లు! ఫ్లాట్‌గానే నిఫ్టీ, సెన్సెక్స్‌!


Stock Market Opening 16 January 2023: 

భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అందడంతో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 20 పాయింట్ల నష్టంతో 17,935 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 5 పాయింట్ల లాభంతో 60,265 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ సూచీ ఒక శాతానికి పైగా ఎగిశాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫీ టాప్‌ గెయినర్స్‌ లిస్టులో ఉన్నాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 60,261 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,550 వద్ద మొదలైంది. 60,220 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,586 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 5 పాయింట్ల లాభంతో 60,266 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

శుక్రవారం 17,856 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,033 వద్ద ఓపెనైంది. 17,924 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,049 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 20 పాయింట్ల నష్టంతో 17,935 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 42,622 వద్ద మొదలైంది. 42,373 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,715 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 33 పాయింట్లు పెరిగి 42,404 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫీ, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్టీపీసీ, ఎం అండ్‌ ఎం, ఐచర్‌ మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎగిశాయి. ఆటో, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.  

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *