PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రాగి ముద్ద తింటే ఈ నొప్పులు తగ్గుతాయట..

[ad_1]

వృద్ధాప్యం వచ్చాక ఎదుర్కొనే సమస్యల్లో మోకాళ్ళు, కీళ్ళలోనొ నొప్పి, వాపులు ఉంటాయి. ఎక్కువ బరువు ఉండడం, కాల్షియం కంటెంట్ లేని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎముకల మద్య ఉండే ద్రవం తగ్గడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి.

చిన్న వయసులోనే..

చిన్న వయసులోనే..

బాధపడాల్సిన విషయం ఏంటంటే.. చిన్న వయసు వారికి కూడా అంటే 30 ఏళ్లు నిండకుండానే చాలా మందికి కీళ్ళ నొప్పులు, చేతుల మణికట్టులో వాపు, అరచేతుల్లో, చేతివేళ్ళలో వాపు, నొప్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ ముఖ్య లక్షణాలు. అన్‌హెల్దీ ఫుడ్, వర్కౌట్ చేయకపోవడం, ఎముకలు బలహీనమవ్వడమనేది కీళ్ళ నొప్పులకి ప్రధాన కారణాలు. ముఖ్యంగా ఈ సమస్య కనిపిస్తే బాడీలోని కీళ్ళలో భరించలేని నొప్పులు రావడమే కాకుండా కూర్చుంటే లేవలని పరిస్థితి. లేస్తే కూర్చోలేని పరిస్థితి కూడా తెచ్చిపెడుతుంది.

ఆర్థరైటిస్ అంటే ఏంటి..

ఆర్థరైటీస్ అంటే ఏంటి..

పసుపు, అల్లం నీరు..

పసుపు, అల్లం నీరు..

ఈ రెండు మూలికల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ళ వాత లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది.
దీనికోసం రెండు గ్లాసుల వేడినీటిలో అర టీస్పూన్ తురిమిన అల్లం, ఓ టీస్పూన్ పసుపు వేసి బాగా మరిగించాలి.
సుమారు పది నిమిషాలు మరిగించాక, కాసేపు చల్లారక తేనె కలపండి. మంచి రిజల్ట్స్ కోసం రోజుకి రెండు గ్లాసులు త్రాగాలి.
Also Read : Pot water : కుండలో నీరు తాగితే ఈ 7 సమస్యలు దూరం..

రుమాటిజం కారణాలు..

రుమాటిజం కారణాలు..

ప్రధానంగా శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడంతో ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు కీళ్ళ నొప్పులకి సంబంధించిన లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
ఇమ్యూనిటీ తగ్గినందున అది మన శరీరానికి తగిన రక్షణ అందట్లేదు.
శరీరంలో అధిక కొవ్వు ఉంటే, కుటుంబంలో ఉన్నవారికి ఉంటే, చెడు లైఫ్‌స్టైల్ పాటిస్తున్నవారికి కూడా త్వరగా సమస్య వస్తుంది.
ఒక్కోసారి ఇలాంటి సమస్యలు వస్తే ఫుడ్స్ ఈ వ్యాధిని ఎలా అదుపు చేస్తాయో చూద్దాం.
Also Read : Shoulder Arthritis : భుజం నొప్పి తగ్గాలంటే ఇలా చేయాలి..

అన్నం తగ్గించడం..

అన్నం తగ్గించడం..

మనందరికీ తెలిసినట్లుగా బియ్యంలోని పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మధుమేహం కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఇవి అంత మంచివి కావు.
ప్రధానంగా దీనివల్ల బరువుని తగ్గించుకోవచ్చు. కాబట్టి, ఈ సమస్య ఉన్నవారు వీలైనంత వరకు అన్నాన్ని తగ్గించాలి. దీని బదులు ఓట్స్, మిల్లేట్స్, పాల వంటి ఆహారాన్ని తీసుకోండి.

రాగి ముద్ద..

రాగి ముద్ద..

ఆరోగ్యపరంగా, రాగుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఇందులో ప్రధానంగా అధిక స్థాయిలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, ఫైబర్ అధికంగా ఉండే దీనిని తినడం వల్ల బరువు తగ్గుతారు.
వీటన్నింటితో పాటు రాగుల్లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి.
దీని ద్వారా కీళ్ళనొప్పులు అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. కాబట్టి, రాగులు, ముద్దెలు, అంబలి, రోటీలను తినడం మంచిది.

రోజుకి అరటిపండు..

రోజుకి అరటిపండు..

ఆరోగ్యకరమైన ఎముకలకి తగినంత కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు అవసరమని మనందరికీ తెలుసు.
అదే విదంగా, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఇవి కండరాల నొప్పి, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సాయపడతాయి.
ఇలా శరీరంలో పొటాషియం కంటెంట్ పెరగాలంటే రోజూ అరటిపండ్లు తినాలి.
అరటిపండులో ఉండే పొటాషియం వల్ల శరీరంలోని ఎముకలు సాఫీగా కదులుతాయని, కీళ్ళు అరిగిపోకుండా చూస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి, రోజూ ఒక అరటిపండు తినడం మంచిది.

​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​Read More : Health News and Telugu News

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *